దఢ పుట్టిస్తున్న మర్కజ్ వ్యవహారం
తెలంగాణలో సీక్రెట్ ఆపరేషన్
ఇంటింటిని జల్లెడ పడుతున్న పోలీసులు
సికింద్రాబాద్‌లో 8 మంది గుర్తింపు
పోలీసుల రాకతో పార్శిగుట్టలో ఆరుగురు పరారీ
ఒక్కరిని పట్టుకుని గాంధీకి తరలింపు
రాపిడ్ బాడీ యాంటి టెస్టులు
కరీంనగర్‌లో ర్యాపిడ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు
హైదరాబాద్ : ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో నిర్వహించిన మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారి వ్యవహారం రోజురోజుకు కొత్త ఆందోళనలు సృష్టిస్తోంది. వీరిలో చాలా మంది వైద్యపరీక్షలకు ముందుకు రాకుండా దాక్కుని వైరస్ వ్యాప్తికి కారణమవుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీనిని ఏదోలా అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఇది ప్రభుత్వాలను, ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. వీరిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేకున్నప్పటికి వారిని పరీక్షించగా చాలా మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసింది. బుధవారం ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిని కేంద్రం అందించిన జాబితా ప్రకారం కనుగొని వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరి రక్త నమూనాలను పరిశీలించగా వారిలో కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిలో కొందరితో పాటు, వీరు కాక వీరి ద్వారా, విదేశీయుల ద్వారా కూడా కరోనా సోకిన పలువురిలో కూడా ఇలాంటి వారు ఉండవచ్చన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలు లేని కారణంగా కూడా చాలా మంది క్వారంటైన్‌కు రాకుండా ప్రజల మధ్య యదేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ఇది మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడం ప్రభుత్వాలకు, ప్రజలకు తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమే. అయితే కేంద్రం కూడా ఇదే విషయాన్ని గుర్తించినప్పటికి బహిర్గతం చేస్తే ప్రజల్లో ఆందోళన తీవ్రమై విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించినట్లు సమాచారం. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన మేరకు ఇలాంటి వారి వ్యవహారం బయటపెట్టకుండా కేంద్రం సూచించిన బాటలో నివారణ చర్యలను గురువారం నుంచి మొదలు పెట్టింది. ఎంత బ్రతిమాలినా ఢిల్లీ వెల్లి వచ్చిన వారు చాలా మంది క్వారంటైన్‌కు రాకుండా తప్పించుకుంటున్నారు. దీంతో వీరంతా ఎక్కడి నుంచి వెల్లారు, ఎంత మంది అని తమ వద్ద ఉన్న జాబితా మేరకు తెలంగాణ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇంటింటికి పోలీసులను పంపించి వారిని వెలికి తీసే పనిని మొదలుపెట్టింది. కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా వారిని వైద్య పరీక్షలకు తరలిస్తోంది. గురువారం సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయినపల్లి, హస్మత్‌పురాలలో పోలీసులు ఇంటింటి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిని ఎనిమిది మందిని గుర్తించి వారిని వైద్య పరీక్షలకు పంపించారు. పార్శిగుట్టలో పోలీసులను గమనించి ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారు ఆరుగురు పరారయ్యారు. వీరిలో అయిదుగురు తప్పించుకోగా ఒక్కరు పోలీసులకు చిక్కారు. ఇతనిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారు అధికంగా ఉన్నట్లు గుర్తించిన నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంగనగర్ తదితర జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో వారిని గుర్తించే పనిని మొదలు పెటప్టడంతో పాటు ఆయా ప్రాంతాలలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మేరకు రాష్ట్రంలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లిన వారి సంఖ్య 1030 కాగా వీరిలో కేవలం 160 మందిని గుర్తించలేదని, ఆప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే మర్కత్ ప్రార్థనలకు ప్రతి ఏటా అధికారికంగా వెల్లే వారి కంటే అనధికారికంగా వెల్లే వారి సంఖ్య దాదాపు రెండు రెట్లు ఉంటుందని సమాచారం. దీంతో ఢిల్లీ వ్యవహారం ఎంత దాకా వెలుతుందో అన్న అనుమానాలు, భయాందోళనలు మాత్రం ఎక్కువ అయ్యాయి. హైదరాబాద్‌లో ఢిల్లీ వెల్లి వచ్చిన వారు మొత్తం 603 మందిగా గుర్తించారు. వీరిలో కొందరు లభించపోవడానికి వారు ఫోన్‌లో కూడా స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఢిల్లీ వెల్లిన వారి జాబితాలో ఒక్కరి పేరు నాలుగు సార్లు ఉంది, అలాగే కొందరి చిరునామాలు తప్పుగా పేర్కాన్నారు. దీంతో అలాంటి వారిని గుర్తించడం కష్టంగా మారింది. కరీంనగర్‌లో ఈ పరిస్థితిని అధిగమించడానికి ఢిల్లీ ప్రార్థనలకు వెల్లి వచ్చిన ఇండోనేషియా వారు సంచరించిన ప్రాంతాలను గుర్తించి కరీంనగర్‌లో గురువారం నుంచి వాటిని అష్టదిగ్భందనం చేశారు. ఇంటింటికి వెల్లి ఇంట్లోని వారందరికి ర్యాపిడ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం అనుమానితులైన 57 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇదే పద్దతిని మిగతా ప్రాంతాలలో కూడా విస్తృతంగా చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ వెల్లి వచ్చిన వారితో పాటు, విదేశాలకు వెల్లి వచ్చిన వారిని గుర్తించడానికి సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టింది. బయటకు కనపడేలా ఈ చర్యలన్నీ తీసుకుంటూనే ఇంటలిజెన్స్‌ను రంగంలోకి దించింది. అనుమానిత ప్రాంతాలకు చెందిన స్థానికులను కొందరిని చేరదీసి వారి సహాయాన్ని తీసుకుంటూనే ఇంటలిజెన్స్ బృందాలు వారిని కనిపెట్టే పనిలో పడ్డాయి. కేంద్రం కూడా కరోనా లక్షణాలు లేకున్నా ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్ రావడాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఎక్కువ కేసులున్న పది ప్రాంతాలను గుర్తించి అవి హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయని ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయని తేల్చింది. వారి ఆచూకి కోసం ఆపరేషన్ ముమ్మరం చేసింది. హాట్‌స్పాట్‌లలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్‌లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి ఆదేశించింది. జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇప్పటి వరకు ఢిల్లీ మత ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిలో దేశ వ్యాప్తంగా 6000 మందిని గుర్తించారు. వీరిలో దాదాపు 5000 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్
RELATED ARTICLES