రోహిత్ శర్మ సెంచరీ
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ బెర్తు ఖరారైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా 48 ఓవర్లకు 286 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్ హసన్(66), సైఫుద్దీన్(51*) అర్ధశతకాలతో రాణించారు. బుమ్రా(4/55) అద్భుతమైన స్పెల్‌తో తమిమ్ ఇక్బాల్ 22, సౌమ్య సర్కార్ 33, ముష్ఫికర్ రహీమ్ 24, లిటన్ దాస్ 22, మోసాదిక్ 3, షబ్బీర్ రహమన్ 36, మష్రాఫె మొర్తజా 8, రుబెల్ 9 పరుగులు చేశారు. పాండ్య 3, బుమ్రా 2, భువనేశ్వర్, షమీ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. కాగా, సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఓపెనర్లు అదరహో..
భారత ఓపెనర్లు రోహిత్ శతకం(104), కెఎల్ రాహుల్(77) అర్ధశతకాలు సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. విరాట్ కోహ్లీ(26), పాండ్య(0) విఫలమయ్యారు. రిషభ్ పంత్ (48) ధాటిగా ఆడాడు. మిడిలార్డర్ విఫలం కావడంతో 314 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాట్స్‌మన్లలో ధోని 35, దినేశ్ కార్తిక్ 8, షమీ 1, భువనేశ్వర్ 2 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజర్ 5, షకిబ్, రుబెల్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు.