కెరీర్ 700వ గోల్ చేసిన పోర్చుగల్ సారధి
ఉక్రెయిన్ : యూరో 2020 మెగా టోర్నీలో ఉక్రేయిన్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్ 2–1తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో క్రిస్టియానో రొనాల్డో 700వ గోల్ కొట్టాడు. మొత్తం 973 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో రొనాల్డో కంటే ముందు చెక్ ఆస్ట్రియన్ ఆటగాడు జోసెఫ్ బికన్ 805 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా రొమారియో 772, పీలే 767 (బ్రెజిల్), ఫెరెన్ పుస్కాస్ 746 (హంగేరి), గెర్డ్ ముల్లర్ 735 (జెర్మనీ) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం 672 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రపంచంలో అత్యుత్తమ పుట్ బాలర్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రొనాల్డో 700వ గోల్స్ రికార్డుని అందుకునే అవకాశం ఒక్క మెస్సీకి మాత్రమే ఉంది. కాగా, పోర్చుగల్ ఓటమితో యూరో 2020 గ్రూప్ బీలో ఉక్రెయిన్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఉక్రెయిన్ వరుసగా మూడోసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఢిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్ 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లూథియానాతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో విజయం సాధించిన సెర్బియా 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
రోనాల్డో అరుదైన రికార్డు
RELATED ARTICLES