మియామి: ఎంతో ప్రతిష్టాత్మకమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విట్లర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో అమెరికా ఆటగాడు, ఏడో సీడ్ జాన్ ఇస్నర్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన నాలుగో సీడ్ ఫెదరర్ 6 6 ఇస్నర్‌ను చిత్తు చేశాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఫెదరర్ మరో టైటిల్‌తో తనలో చేవతగ్గలేదని నిరూపించాడు. తొలి సెట్‌లో స్విస్ దిగ్గజం పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో అలరించిన ఫెదరర్ ఏదశలోనూ ఇస్నర్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన ఫెదరర్ అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ఫెదరర్‌కు కాస్త పోటీ ఎదురైంది. ఈసారి ఇస్నర్ కాస్త మెరుగైన ఆటను కనబరిచాడు. ఫెదరర్‌కు గట్టి పోటీ ఇస్తు ముందుకు సాగాడు. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురి కావడంతో ఓటమి తప్పలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలటెట్టుకున్న ఫెదరర్ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి తన ఖాతాలో మియామి ఓపెన్‌ను జత చేసుకున్నాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
రోజర్ ఫెదరర్‌దే మియామి టైటిల్
RELATED ARTICLES