l అన్ని వర్గాలూ అండగానిలువాలె పార్టీల నేతలు పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనను కొనసాగించాలని, రైతులపోరాటానికి అన్ని వర్గాలూ అండగానిలువాలని వామపక్ష పార్టీ ల నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం జరగనున్న ‘భారత్‌బంద్’ను విజయంతమయ్యేలా అందరూ సహకరించాలని కోరాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు సహకరించాలని కోరాయి. భారత్‌బంద్‌కు టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. ‘భారత్‌బంద్’లో భాగంగా కోఠి నుంచి ఆర్‌టిసి క్రాస్‌రోడ్ వరకు ప్రదర్శన, ఆ తర్వాత బహిరంగ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వామపక్ష పార్టీల నేతలు చాడ వెంకట్‌రెడ్డి (సిపిఐ), జూలకంటి డి.జి.నర్సింహరావు పోటు రంగారావు, రమ(సిపిఐ- ఎంఎల్.న్యూడెమోక్రసి), గాదగోనిరవి (ఎంసిపిఐయు),అచ్యుత రామారావు, సం ధ్య (సిపిఐ-ఎంఎల్.న్యూడెమోక్రసి), మురహరి(ఎస్‌యుసిఐసి), రాజేష్(సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్), ప్రసాద్(ఫార్వర్డ్‌బ్లాక్) కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయరంగాన్ని మోడి ప్ర భుత్వం ధారధత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం జరగడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్య మవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బారికేడ్లు, బండరాళ్లు, బాష్పవాయులు గోళాలు, లాఠీచార్జ్‌ను కూడా లెక్కచేయకుండా రైతులు ఢిల్లీకి చేరారన్నారు. రైతులకు ము ప్పు వస్తుందని తెలిసినా కేంద్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహారిస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రీకృత ని యంతృత్వ అప్రజాస్వామిక విధానాలను కేంద్ర ప్రభు త్వం అవలంభిస్తోందరి విమర్శించారు. ట్రాక్టర్లు, ఎడ్ల బం డ్లతో ఎక్కడికక్కడ నిరసనలు తెలుపాలన్నారు. చట్టాలను రద్దుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాల ద్వారా వ్యవసాయ రంగం కార్పోరేట్ చేతుల్లోకిపోతుందని, నిత్యాసవర ధరలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ పోతుందని చెప్పారు. ఢిల్లీలో రైతుల పరిస్థితి దయానీయంగామారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టా ల ప్రకారం కార్పొరేట్ సంస్థలు ఏది చెబితే ఆపంటలనే పండించాల్సి ఉంటుందని, వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్‌మయం అవుతుందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థ లు బలంగా ఉండాలని కాషాయ శక్తులు కోరుకుంటున్నాయన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే మోడీ లక్ష్యమన్నారు. పోటు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి అంబానీ, ఆదానిలపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. నల్ల చట్టాల రద్దు విషయంలో కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. జిహెచ్‌ఎంసి ఫలితాల ఆత్మపరిశీలనో, డిఫెన్స్‌లో పడినందుకో మొత్తానికి భారత్‌బంద్‌కు టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించడం ఆహ్వానించ దగిన అంశమన్నారు. రాష్ట్రంలో సన్నధాన్యాల వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనను కొనసాగిస్తాం
RELATED ARTICLES