HomeNewsLatest Newsరైతు రుణమాఫీపై విపక్షాలవి దురుద్దేశ విమర్శలు

రైతు రుణమాఫీపై విపక్షాలవి దురుద్దేశ విమర్శలు

ఆధార్‌, రేషన్‌ కార్డుల వివరాలు సరిగా లేని కారణంగా కొన్ని ఇబ్బందులు.
త్వరలోనే వాటిని పరిశీలించి ఇస్తాం.
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.

ప్రజాపక్షం / హైదరాబాద్‌
రైతు రుణమాఫిపై రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఆధార్‌, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేని దాదాపు 5 లక్షల మంది అన్నదాతల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి కూడా రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ, దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌సి టి. జీవన్‌ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షా 20 వేల ఖాతాల ఆధార్‌ నెంబ ర్‌లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగిందన్నారు. లక్షా 61 వేల అకౌంట్‌ లలో ఆధార్‌ కు పాస్‌ బుక్‌ పేరు కు మిస్‌ మ్యాచ్‌ ఉందన్నారు. లక్షా 50 వేల అకౌంట్‌ ల లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయని, 4 లక్షల 83 వేల అ రేషన్‌ కార్డు లేని ఖాతాల వెరిఫికేషన్‌ చే యా ఉందని తెలిపారు. 8 లక్షల అకౌంట్‌లకు రెండు లక్ష కంటే రుణాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఈ కారణంగానే రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఆచీతూచి పరిశీలిస్తోందన్నారు. 2014 తర్వాత బిజెపి ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్నారు. పదేళ్లుగా కేంద్రం అధికారంలో ఉన్న ఆ పార్టీ, రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. రైతులను రుణ విముక్తులను చేయాలన్న దృఢ సంకల్పంతో తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా రైతులను మోసం చే యడమే బిఆర్‌ఎస్‌కు అలవాటని మంత్రి ఉత్తమ్‌ కుమా ర్‌ రెడ్డి విమర్శించారు. వారి మోసపూరిత మాటలు న మ్మవద్దని రైతులను కోరారు. బిఆర్‌ఎస్‌ మళ్లీ వచ్చేది లే దు, సచ్చేది లేదని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీకి కెటిఆర్‌ లేఖ ప్రచారం కోసం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఏనాడూ రుణమాఫీ కోసం మాట కూడా మాట్లాడలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్‌షిప్‌ స్లోగన్‌ పెట్టి రైతుల మేలు కోసం ఒక్క అడుగు వేయలేదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయ డం, గందరగోళ పరిస్థితులను చేస్తున్న విషయాలను యావత్తు తెలంగాణ రైతాంగం గమనించాలని మనవి చే స్తున్నామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రక్రి య నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. వాటి ని సవరించడానికి ప్రక్రియ మొదలుపెట్టామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే రుణమాఫీ చేస్తామని వివరించారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగా లేకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. మండల వ్యవసాయాధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రూ.26 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతి కర్షకుడికి కచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 8లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పును తాము రుణమాఫీ చేశామన్నారు. రైతులకు నిధులు అందడం లేదంటూ బిఆర్‌ఎస్‌, బిజెపి నేతలు విమర్శలు చేయడం సరి కాదన్నారు. డ్యూబ్లికేట్‌లోనే అకౌంట్స్‌ కూడా ఉన్నాయన్నారు. ఈ కారణంగానే గత ప్రభుత్వం రుణమాఫీలో చాలా తప్పులు చేశాయన్నారు.బావ బామ్మర్థులు సవాల్‌ విసిరి తప్పించుకోవడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్‌, హరీష్‌ రావులనుద్ధేశించి అన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారన్నారు. బిఆర్‌ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, .. సచ్చేది లేదన్నారు. కెటిఆర్‌, ఖర్గేకు లేఖరాయడం అనేది ప్రచారం కోసమేనన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి టి. జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ,బిఅరెస్‌ రెండు పార్టీలు రుణమాఫీ ని జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ లో మాత్రం రుణమాఫీ చేసిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇలా రుణమాఫీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జీవన్‌ రెడ్డి అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments