కేంద్రం మొండి వైఖరిపై నిరసనలతో హోరెత్తిన భోపాల్
లాఠీచార్జ్, బాష్పవాయు గోళాలతో అడ్డుకున్న భద్రతా దళాలు
భోపాల్: పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శనివారం భోపాల్‌లో జరిగిన మద్దతు ర్యాలీపై మధ్య ప్రదేశ్ బిజెపి సర్కారు ఉక్కుపాదం మోపింది. లాఠీ చార్జి చేసి, బాష్పవాయి గోళాలు, వాటర్ కానన్లను ప్రయోగించి, నిరసనకారులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు పలువురు మద్దతుదారులు శనివారం సంఘీభావ ర్యాలీని చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తదితర కీలక నేత లు రావడంతో, చలో రాజ్‌భవన్ నినాదంతో కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. రాజ్‌భవన్‌ను చుట్టుముట్టి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను ఘెరావ్ చేయాలన్న ఉద్దేశంతో ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులను జవహర్ చౌక్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీనితో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్‌భవన్ సమీపానికి వెళ్లేందుకు ప్రయత్నించే వారిని నిలువరించడానికి పోలీస్‌లు, భద్రతా దళాలు లాఠీ చార్జి జరిపారు. ఈ క్రమంలో ఆరుగురు పోలీస్‌లకు గాయాలయ్యాయని అధికారులు ప్రకటించారు. కాగా, కొత్త రైతు చట్టాలు పూర్తిగా రైతు వ్యతిరేకమని ఈ ర్యాలీలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమని, రైతులు బానిసలుగా మారిపోతారని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని ఈ విధంగా అణచి వేయడం ఫ్యాసిస్టు చర్యలకు తార్కాణమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా మధ్య ప్రదేశ్ సర్కారు వైఖరిని ఖండించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బకొట్టే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నినాదంతో కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. రాజ్‌భవన్‌ను చుట్టుముట్టి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను ఘెరావ్ చేయాలన్న ఉద్దేశంతో ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులను జవహర్ చౌక్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీనితో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్‌భవన్ సమీపానికి వెళ్లేందుకు ప్రయత్నించే వారిని నిలువరించడానికి పోలీస్‌లు, భద్రతా దళాలు లాఠీ చార్జి జరిపారు. ఈ క్రమంలో ఆరుగురు పోలీస్‌లకు గాయాలయ్యాయని అధికారులు ప్రకటించారు. కాగా, కొత్త రైతు చట్టాలు పూర్తిగా రైతు వ్యతిరేకమని ఈ ర్యాలీలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమని, రైతులు బానిసలుగా మారిపోతారని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని ఈ విధంగా అణచి వేయడం ఫ్యాసిస్టు చర్యలకు తార్కాణమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా మధ్య ప్రదేశ్ సర్కారు వైఖరిని ఖండించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బకొట్టే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.