HomeNewsBreaking Newsరైతు ప్రయోజనాల కోసం మొదలైన యుద్ధం

రైతు ప్రయోజనాల కోసం మొదలైన యుద్ధం

అవసరమైతే ఢిల్లీ యాత్ర చేపడతాం
కేంద్ర ప్రభుత్వానికి సిఎం కెసిఆర్‌ హెచ్చరిక
ఇందిరాపార్క్‌ వద్ద టిఆర్‌ఎస్‌ మహాధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రైతుల ప్రయోజనాల కోసం యుద్ధాన్ని ప్రారంభించామని, అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. యాసంగిలో వడ్లు కొంటారా? లేదా? సమాధానం చెప్పాలని ప్రధానిమంత్రిని ప్రశ్నించారు. పదవులు, కేసులకు తాము భయపడే బాపతికాదని, ప్రజల సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవసరమనుకుంటే, తప్పదనుకుంటే, భారత రైతాంగ సమస్యలకు టిఆర్‌ఎస్‌, తెలంగాణ నాయకత్వం తీసుకుంటుందని, కేంద్ర మేడలు వంచుతామని, కేంద్ర దుర్మార్గ నీతిని, రైతు వ్యతిరేక చట్టాల వ్యతిరేకంగా తమ చివరి రక్తం బొట్టు వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. రెండు,మూడు రోజలలో కేంద్రం నుంచి స్పందన రాకపోతే యుద్దాన్ని ప్రజ్వాలింపజేస్తామని, ఎక్కడి వరకు తీసుకుపోవాలో అక్కడి వరకు పోతామన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ మంత్రివర్గం, టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులందరూ హైదరాబాద్‌,ధర్నాచౌక్‌ వద్ద గురువారం ‘మహాధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ సభనుద్దేశించి ప్రసంగిస్తూ వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్దానికి శ్రీకారాం చుట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని, అంతం కాదన్నారు. యాసంగిలో వరి కొంటారా? లేదా? వరి పంట వేయాలని అబద్దాలు చెప్పినందుకు ముక్కు నేలకు రాస్తారా? లేదా సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దళిత వర్గీకరణ, గిరిజన రిజర్వేషన్లు, బిసి జనగణన తీర్మానం ఇలా పెండింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. అనేక ప్రజా సమస్యలను, అనేక విషయాలు పక్కన పెట్టి, ఓట్లు, ఎన్నికలు వచ్చినప్పుడు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, సర్జికల్‌ స్ట్రుక్‌, సరిహద్దులో ఆడే నాటకలు ప్రజలకు అర్థమైందని, మోసాలు, మొత్తం బట్టబయలు అయిందన్నారు.
ఇంగీతజ్ఞానం లేని పాలకులు
విషయాన్ని అర్థంచేసుకోని ఇంగీత జ్ఞానం లేని పాలన సాగుతుందని సిఎం న్నారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉన్నదని, వారి బుర్రలు పనిచేయడం లేదని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో రైతులు చేస్తున్న ధర్నాలను అణచివేస్తూ దాడులకు పాల్పడుతూ వారి జీవితాలతో చెలగాడమాడుతున్నారని విమర్శించారు. రైతులపై కార్లు ఎక్కించి చంపుతూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు వచ్చారని తెలిపారు. కల్లాల వద్ద రాజకీయ డ్రామాలడుతున్నారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో అడ్డగోలుగా, ఢొంకతిరుగుడుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్లు వేయకూడదని చెప్పడం తనకు ఇష్టం లేకపోయినా మన రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ఇతర పంటలు వేయాలని కోరినట్టు సిఎం తెలిపారు. దేశాన్ని పాలించే బిజెపి అడ్డగోలుగా నోరు విప్పితే అబద్దాలు మాట్లాడుతూ , వాట్పాస్‌, ఫేస్‌బుక్‌లో వితండవాదాలు చేస్తున్నారని, వ్యక్తుల క్యారక్టర్‌ తక్కువ చేసి చూపుతున్నారని తెలిపారు. అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కొత్తగా వచ్చినా రాష్ట్రం సర్దుబాట్లు చేసుకోవాలని, ఓపిక పట్టామన్నారు. కానీ తమ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుందని, పద్ధతిఉంటుందన్నారు. వడ్లు వేయాలని రైతులను చెప్పి ఆ తర్వాత బజారులో వడ్లు పోసి రాజకీయ నాటకం ఆడాలని బిజెపి చూస్తోందని ఆరోపించారు.
బిజెపి పార్టీ ఆఫీస్‌పైన 5 లక్షల వడ్లు పోస్తాం
మిగిలిన 5 లక్షల వడ్లను కేంద్రం తీసుకోకపోతే ఆ ధాన్యాన్ని రైతులపై దిష్టి తీసి, బిజెపి పార్టీ ఆఫీస్‌ మీద కుమ్మరిస్తామని సిఎం కెసిఆర్‌ హెచ్చరించారు. కేంద్రం చాట్ల తవుడు పోసి రాష్ట్రాలకు తగాదాలు పెడుతుందన్నారు. వడ్లతో ప్రారంభమైన ఈ పోరాటం, దేశం కోసం పోరాటం చేస్తామన్నారు. ఎన్నికలు వస్తే భైంస, హిందూముస్లిం, కొట్లాటలు, పాకిస్తాన్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ఇదేనా రాజకీయం?, ఇందుకే ప్రజలు ఎన్నుకున్నారా అని ప్రశ్నించారు. రైతుల కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని, రైతుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలని కేంద్రం చెబుతుందని, ఒక వేళ వసూలు చేయని రాష్ట్రాల అప్పులు ఆపేస్తామని, కష్టపెడతామని చెప్పడం, ఇదేనా కేంద్ర పాలసీ అని ఆగ్రహం వ్యక్తం చేఉశారు.
దేశంలో మరో పోరాటం ..జెండా లేవాల్సిందే..
గోల్‌మల్‌, గోల్‌మల్‌ గుండంగాళ్లకు దేశంలో నీరు, కరెంటు ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేని అసమర్థులకు, చరమగీతం పాడుతేనే దేశానికి నిష్కృతి అని సిఎం అన్నారు. కచ్చితంగా జెండా లేవాల్సిందేనని, దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందేనని, దేశానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందేనన్నారు. మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశం మూగబోతుందని, మాట్లాడితే కేసులు పెడుతామని, రా పెడుదువు రా? ఏం పెడుతావో పెట్టాలని, కెసిఆర్‌ భయపడుతారా? , భయపడితే తెలంగాణ వచ్చునా?’ అని ప్రశ్నించారు. పిచ్చికూతలు మానుకోని దమ్ము, చిత్తశుద్ది ఉంటే, వర్షకాలంలో వడ్లు కొంటారా? లేదా? అని ప్రశ్నించారు. ధాన్యం కొంటామని గాలి మాటలు మాట్లడితే కుదరదన్నారు. వరి వేసి పంటలు అమ్ముడుపోకపతో రైతులు ఇసం తాగి చావాలా?,చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? ఆత్మత్యలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇంత అరాచకంగా కేంద్ర నాయతక్వం వ్యవహారించవచ్చునా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాన్ని ఎదరించే అవసరం లేదా? దుర్మార్గ చట్టాలపై నలగిపోవాలా?, నాశనం కావాలా? అని ప్రశ్నించారు. కేంద్రం స్పందిచకపోతే గ్రామాల్లో చావు డప్పులు చేస్తామని, పోరాటం చేస్తామన్నారు. రణం చేయడంలో టిఆర్‌ఎస్‌ను మించిన పార్టీ దేశంలోనే లేదని, యుద్ధం ప్రారంభిస్తే దేనికీ భయపడమని, ముందుకు సాగాతమని సిఎం తెలిపారు.
రైతు వ్యతిరేక చట్టాలను అప్పుడే వ్యతరేకించాం: కెకె
టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను తాము వ్యతిరేకించామని, పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి ఎడ్లు లేవని, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బండి లేదని ఎద్దేవా చేశారు. మంత్రి జి. జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ ఇది కేంద్ర, రాష్ట్ర తగాదా కాదని, టిఆర్‌ఎస్‌, బిజెపి కాట్లాట అసలే కాదన్నారు. రైతాంగం మొత్తం కెసిఆర్‌ వెంట ఉన్నదని, ఇక ఢిల్లీ కి వెళ్ళక తప్పదన్నారు. కడియం శ్రీహరి మాట్లడుతూ రైతు ప్రయోజనాల విషయంలో మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకు కెసిఆర్‌ ముందడుగు వేయాలని, తాము వెంట ఉంటామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments