రైతు, ప్రజల ఆహార భద్రతకు గ్యారెంటీ
పాలకుల విధానాలు తప్పుగా ఉంటే అన్నదాతకు ఏ రకంగా మేలు చేస్తాయి…
కేంద్ర సర్కార్‌ను నిలదీసిన ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య
తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల శిక్షణ శిబిరం ప్రారంభం
ప్రజాపక్షం / హైదరాబాద్ రైతు అనుకూల విధానాలే రైతు భద్రతకు, ప్రజల ఆహార భద్రతకు గ్యారెంటీ అని ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య ఉద్ఘాటించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు అవుతుందని ప్రధానమంత్రి మోడీ అనేకసార్లు మాట్లాడినా…. ఆచరణలో రైతుల ఆదాయం కేవలం 30 శాతం మాత్రమే పెరిగిందన్నారు. మద్దతు ధరల పెరుగుదల 2014 సంవత్సరానికి ముందు 14 శాతం పెరిగితే 2014 నుండి 2023 నాటికి కేవలం నాలుగు శాతంగా మాత్రమే ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తార్నాకలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రైతుల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. తొలుత శిబిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు సంఘం జెండాను కిష్టయ్య ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం రాష్ర్ట కార్యదర్శి శ్రీనివాసు స్వాగతం పలుకగా, తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యక్షులు కంజర భూమయ్య అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, కౌలు రైతుల రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొప్పోజు నారాయణ, ప్రభులింగం, రాష్ర్ట కార్యదర్శిలు బండ రాజిరెడ్డి, వర్ల వెంకటయ్య, దేవి దాస్ హాజరయ్యారు. తొలుత ప్రొఫెసర్ జానయ్య ప్రసంగిస్తూ పాలకుల విధానాలు తప్పుగా ఉంటే రైతులకు ఏ రకంగా మేలు చేస్తాయని ప్రశ్నించారు. రైతుల శ్రమతో ఈ దేశ సంపద పెరుగుతుందని, రైతు కుటుంబాల పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు వారి పిల్లలకు విద్యా, ఆరోగ్యం, ఉద్యోగం, ఉపాధి కల్పించటానికి బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించడం లేదని, రైతుల శ్రమతో వచ్చిన సంప కార్పొరేట్ల అప్పులను రద్దు చేయడానికి ఉపయోగిస్తున్న దారుణమైన పరిస్థితి కేంద్ర పాలకుల విధానాల వల్ల దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిరంకుశ ధోరణులను ఓడించటానికి రైతాంగాన్ని సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.భూసార పరీక్షలు చేసి భూ ఆరోగ్య కార్డు (సాయిల్ హెల్త్ కార్డు) ఇస్తామని 2016 వ సంవత్సరంలో కేంద్రపాలకుల అట్టహాసంగా ప్రకటించినా ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందారని తప్పుడు లెక్కలు చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ఉపాధ్యక్షుడు వి ఎస్ ప్రసాద్ శాస్త్రి వివరించారు. వ్యవసాయం -విత్తనాలు అంశంపై సోమ మర్ల మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి వివరించారు. భూముల రీ సర్వే చేసి కొత్త రికార్డులను రూపొందించుకోవటమే భూ సమస్య సమగ్ర పరిష్కారానికి మార్గంభూమి సునీల్ ప్రతిపాదించారు. శిక్షణా శిబిరానికి 22 జిల్లాల నుండి 87 మంది రైతు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు.
రైతు అనుకూల విధానాలే…
RELATED ARTICLES