సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
28న మీరట్‌లో కిసాన్ పంచాయత్
న్యూఢిల్లీ: మూడు సాగు చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత మూడునెలలుగా చేస్తు న్న ఆందోళనను మరింత ఉధృతంగా కొనసాగించడానికి కార్యాచరణ ఖరారు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారంనాడు ప్రకటించింది. మరోవైపు ఈనెల 28న మీరట్‌లో కిసాన్ పంచాయత్ నిర్వహిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. ఉత్తర ప్రదేశ్ నుండి పలువురు రైతు నాయకులతో విధానసభ భవనంలో సమావేశమైన కేజ్రీవాల్, సాగు చట్టా లు రైతుల ప్రాణాలు హరించేవిగా ఉన్నాయని విమర్శించారు. ఈ చట్టాలను ఆయన డెత్ వారెంట్స్‌గా అభివర్ణించారు. రైతుల న్యాయపరమైన డిమాండ్లను తాము సమర్థిస్తున్నామని ఆయన చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చేందుకు 28న ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలో కిసాన్ పంచాయత్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రం మొండివైఖరి మానుకుని సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధమైందని ఎస్‌కెఎం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసేవరకూ ఢిల్లీ సరిహద్దుల్లోని ఆందోళనాకేంద్రాల నుండి వెనుదిరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈనెల 23న ‘పగడి సంభాల్ దివన్’, 24న ‘దామన్ విరోధి దివన్’ నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా 26న ‘యువ కిసాన్ దివస్’, 27న ‘కిసాన్ ఏక్తా దివన్’ నిర్వహిస్తామని ఎస్‌కెఎం ప్రకటించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణులకు భయపడేది లేదని ఎస్‌కెఎం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. మార్చి 8న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒకవేళ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తమ ఫలసాయాన్ని ధ్వంసం చేసుకునే చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ తికాయత్ రైతులకు పిలుపునిచ్చారు. మోడీ సర్కారు వైఖరికి నిరసనగా కొంతమంది రైతులు తమ పొలాల్లోని పంటలు తవ్వేసి బయటపడేసిన సంఘటనలపై తికాయత్ స్పందించారు. ఆందోళన అంటే విధ్వంసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ట్రాక్టర్ ర్యాలీ’, ‘చక్కాజామ్’, ‘రైల్‌రోకో’ వంటి పలు నిరసన కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించామని, ఇకపై విభిన్న రీతుల్లో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుండే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కూడా కార్మిక కర్షక సంఘాల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ ఆందోళనలలో పాలుపంచుకోవడం విశేషమని తికాయత్ చెప్పారు. యువత కూడా రైతు ఉద్యమానికి బాసటగా నిలుస్తోందని ఆయన అన్నారు. రద్దు చేసేవరకూ ఢిల్లీ సరిహద్దుల్లోని ఆందోళనాకేంద్రాల నుండి వెనుదిరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈనెల 23న ‘పగడి సంభాల్ దివన్’, 24న ‘దామన్ విరోధి దివన్’ నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా 26న ‘యువ కిసాన్ దివస్’, 27న ‘కిసాన్ ఏక్తా దివన్’ నిర్వహిస్తామని ఎస్‌కెఎం ప్రకటించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణులకు భయపడేది లేదని ఎస్‌కెఎం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. మార్చి 8న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒకవేళ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తమ ఫలసాయాన్ని ధ్వంసం చేసుకునే చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ తికాయత్ రైతులకు పిలుపునిచ్చారు. మోడీ సర్కారు వైఖరికి నిరసనగా కొంతమంది రైతులు తమ పొలాల్లోని పంటలు తవ్వేసి బయటపడేసిన సంఘటనలపై తికాయత్ స్పందించారు. ఆందోళన అంటే విధ్వంసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ట్రాక్టర్ ర్యాలీ’, ‘చక్కాజామ్’, ‘రైల్‌రోకో’ వంటి పలు నిరసన కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించామని, ఇకపై విభిన్న రీతుల్లో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుండే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కూడా కార్మిక కర్షక సంఘాల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ ఆందోళనలలో పాలుపంచుకోవడం విశేషమని తికాయత్ చెప్పారు. యువత కూడా రైతు ఉద్యమానికి బాసటగా నిలుస్తోందని ఆయన అన్నారు.
రైతుల పోరు మరింత ఉధృతం
RELATED ARTICLES