ప్రజాపక్షం/ నల్లగొండ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆళ్లగడప రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడలో ప్రభుత్వ భూములను వదిలి రైతుల భూములలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం పట్ల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రైతుల వ్యవసాయ భూములలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ భూములను పరిశ్రమలకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. బీడు భూములు మిర్యాలగూడ మండలంలో అనేకమున్నాయని, అధికారులు చేపడుతున్న భూ సర్వేను తక్షణమే ఉపసంహారించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు