l మూడు రైతు వ్యతిరేక చట్టాలు
l వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలి
l ధరల అమలుపై ప్రత్యేక చట్టాన్ని చేయాలి
lతెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ భవన్‌లో ఎఐకెఎస్‌సిసి నేతల దీక్షలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్దిని వ్యతిరేకిస్తుందని అఖిల భారత రైతు పోరాట సమన్యయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) కన్వీనర్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్వ పద్మ అన్నారు. 2020 అక్టోబర్ 14వ తేదీన మద్ధతు ధరల హక్కుల సాధన దినంగా పాటిస్తూ రైతులు పండించిన పంటలకు మద్ధతు ధరలు – అమలుపై ప్రత్యేక చట్టాన్ని చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మగ్దూం భవన్‌లో ఎఐకెఎస్‌సిసి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పశ్య పద్మతో పాటు ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్లు వేముల వెంకట్రామయ్య, టి.సాగర్, విస్సా కిరణ్ చేపట్టారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన స్వేచ్ఛ మార్కెట్, కాంట్రాక్టు వ్యవసాయం, నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. మద్ధతు ధరలు అ మలుపై ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చిందని, ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ భూముల్లోనే కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయాలని పద్మ డిమాండ్ చేశారు. పంటలు చేతికొచ్చిన సమయంలో కూడా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, మద్ధతు ధరలు ప్రకటించకుండా చోద్యం చూస్తుందని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్ధతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాగర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తాయన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్‌కు అస్కారం కలిగిస్తుందన్నారు. బిజెపి అనుబంధ సంఘమైన కిసాన్ మోర్చ కూడా ఈ చట్టాలను వ్యతిరేకించిందని గుర్తు చేశారు. వెంకట్రామయ్య మా ట్లాడుతూ మూడు దశాబ్దాలుగా రైతులు తీవ్రమైన సంక్షోభాలు ఎదుర్కుంటున్నారని అన్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం కార్పొరేట్ల అధినంలోకి వెళ్లీపోతుందన్నారు. రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వా లే కష్టాల పలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కిరణ్ మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి తప్పుడు ప్ర చారాన్ని రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రైతులను దొచుకునేందుకు దళారులు ఉన్నారని, చట్టాల అమలుతో వారి స్థానంలో కార్పొరేట్ సంస్థలు వ స్తాయన్నారు. పంటలను నిల్వ చేసుకునేందుకు సౌకర్యా లు కల్పించలేదన్నారు. బీహార్‌లో మార్కెట్ యార్డులు ర ద్దు చేసిన తరువాత కనీస మద్ధతు ధర కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చట్టాలు అమల్లోకి వస్తే బీహార్ పరిస్థితులు దేశమొత్తం అమలు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పని పద్మ, ఝాన్సీ, ఆర్. రాహుల్, ప్రదీప్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నా రు.