కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కొనసాగనున్న ఆందోళనలు
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గైర్హాజర్ కావడంతో రైతు ప్రతినిధులతో చర్చలు అర్ధాంతరంగానే ముగిశాయి. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై రైతు ప్రతినిధులతో సమావేశం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న విధంగానే బుధవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో రైతు సంఘాల నేతలతో కేంద్రం సమావేశమైంది. సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి హాజరయ్యారు. అయితే సాక్షాత్తూ కేంద్ర మంత్రి తోమర్ హాజరు కావాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. అయినా సరే… కేంద్ర మంత్రి తోమర్ హాజరు కాకపోవడంతో రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల మధ్యలోంచి బయటికి వచ్చేసి… పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న ఆందోళనలను కొనసాగిస్తామని ప్రకటించారు. “ఈ చర్చలతో మేం సంతృప్తి చెందలేదు. అందుకే వాకౌట్ చేశాం. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందే. మా డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు.” అని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
రైతులతో చర్చలు విఫలం
RELATED ARTICLES