ప్రగతికి మూలాధారం కార్మికుడు
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/ సిద్దిపేట ప్రతినిధి రైతుబీమా తరహాలో కార్మికబీమా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డిజిటల్‌కార్డుల రూపకల్పన స్పెషల్ డ్రైవ్ చేపడుతామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ప్రగతికి మూలాధారం కార్మికుడన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం నడిచేది వారి కష్టంమీదనేనని అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి భరోసా నిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన కొండ భూదేవి గార్డెన్‌లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్డు ఉంటేనే లబ్ధ్దిపొందే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అవసరమైతే ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈమేరకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ కౌముదితో ఫోన్‌లో చర్చించారు. ఒక్క సారి డిజిటల్ కార్డు తీసుకుంటే ఐదేళ్ల వరకు పరిమితం అయిందన్నారు. ఇప్పుడు పదేళ్ల వరకు పరిమితం అవుతుందన్నారు. భవన నిర్మాణానికి బీమా 3లక్షల పెంపుకు కృషిచేస్తానన్నారు. కార్మికులకు 5లక్షల వరకు ఉచిత ఆరోగ్య వైద్య సేవ లు వర్తించేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. క్యాన్సర్, గుండె చికిత్సలకు 10లక్షల వర కు ఆరోగ్య బీమా వర్తించేలా ఆగస్టు నుండి అమలుకానుందన్నారు. సిద్దిపేటలో
కార్మిక భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంల ఎంఎల్‌సి ఫారుఖ్‌హుస్సేన్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
- సిద్దిపేట చేపలు ఆంధ్ర, కలకత్తా, మహారాష్ట్ర ఎగుమతి
సిద్దిపేట జిల్లాలోని చేపలు పశ్చిమ బెంగాల్ కలకత్తా, మహారాష్ట్ర చంద్రాపూర్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడకు ఎగుమతి చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. జాతీయమార్కెట్‌లో సిద్దిపేట చేపలు వెళ్లటంతో మత్స్యకారులకు ఆశాజనకంగా మారిందన్నారు. తమ ప్రాంతంలో పెరిగిన ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయటంలో సంబురంలో మునిగితేలుతున్నారు. - బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి అధికార ప్రతినిధి గోపినాథ్‌రెడ్డి
సిద్దిపేట మండల తోర్నాల గ్రామానికి చెందిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గోపినాధ్‌రెడ్డి తన అనుచరులతో బిజెపికి గుడ్‌బై చెప్పి మంత్రిహరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్‌రావు అభివృద్ధి చూసి బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యాదయ్య, జడ్పిటిసి కోటగిరిగౌడ్,పరమేశ్వర్, దండ్ల రమేశ్, చింతమడక చంద్రం తదితరులు పాల్గొన్నారు.