నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సులకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
25 శాతం సర్వీసులే నడపనున్న ఆర్‌టిసి
కర్నాటక, మహారాష్ట్రకు కూడా బస్సులు నడపాలని నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం నుంచి 25 శాతం బస్సులతో తొలుత సిటీ సర్వీసులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే ఎక్కడెక్కడ, ఏ ఏ రూట్లలో నడపాల అనే దానిపై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. బస్సులు రోడ్డు ఎక్కనున్నాయని, అందుకు సిటీలోని అన్ని డిపోలను అప్రమత్తం చేశామని వెల్లడించారు. హైదరాబాద్ సిటీలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం శుక్రవారం నుండి బస్సులను నడపనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బస్సులను నడపనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కాగా కరోనా వైరస్ వల్ల హైదరాబాదులోని సిటీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దాదాపు 185 రోజుల తర్వాత గురువారం పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే నగర శివార్లలోని డిపోల నుంచి 229 బస్సులను అధికారులు తిప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 29 డిపోలు, 3,200 బస్సులు ఉన్నాయి. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా కారణంగా మార్చి 19న సిటీ, జిల్లా బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో బస్సులు నడిపినా ఇబ్బందులు ఉండవని ఆర్‌టిసి అధికారులు భావిస్తున్నారు.
రైట్.. రైట్!
RELATED ARTICLES