ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళసై
6న ఎపిహైకోర్టు సిజెగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చీ రేపు ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 6న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఈ నెల 7న ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణం
RELATED ARTICLES