రివర్స్ రెపోరేటు 3.75శాతానికి తగ్గింపు
హౌసింగ్ బోర్డుకు రూ. 10 వేల కోట్లు, నాబార్డుకు రూ.25వేల కోట్లు కేటాయింపు
ఆర్‌బిఐ కీలక ప్రకటనలు
ముంబయి : కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మరింత చితికిపోయిన నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఇప్పటి వరకు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోనే వుం దని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ ప్రకటించింది. లాక్‌డౌన్ తర్వాత రూ. 1.2 లక్షల కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారంనాడిక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడారు సూక్ష్మ ఆర్థిక సం స్థలకు రూ.50వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అలాగే,రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. కాకపోతే, రెపో రేటు యథాతథంగా వుంటుందన్నారు. రాష్ట్రాలకు 60శాతం మేరకు వేస్ అండ్ మీన్స్‌అడ్వాన్సెస్(డబ్ల్యూఎం
ఊపందుకున్న మార్కెట్ : ఆర్‌బిఐ నిర్ణయాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వ్యవస్థలోకి నిధులు మళ్లించడం, రివర్స్ రెపో రేట్ తగ్గించడం, మొండి బాకీలకు సంబంధించిన నిబంధనలు సడలించడం సహా తీసుకున్న పలు చర్యలతో ఫైనాన్షియల్ స్టాక్స్ దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 986.11 పాయింట్లు లాభంతో 31,588.72 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 273.95 పాయింట్లు ఎగబాకి 9వేల పాయింట్ల మార్కును దాటి 9,266.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.39గా ఉంది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్‌బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే, హెయూఎల్, భారతీ ఇన్ ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాలతో ముగియడం దేశీయ సూచీల పరుగుకు ఊతమిచ్చింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్ల షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఋణపరపతి పెరుగుతుంది : ప్రధాని మోడీ
రిజర్వు బ్యాంక్ ప్రకటన ద్రవ్యలామణీకి ఋణపరపతి మెరుగుదలకు గొప్పగా దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన చిన్న వ్యాపారాలు, చిన్న, మద్య తరహా పరిశ్రమల రంగం, రైతులు, పేదలకు ఆర్.బి.ఐ చర్యలు ఉపయోగపడతాయన్నారు.
కాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు తగినంత ద్రవ్యం అందుబాటులోకి వస్తుందని, కోవిడ్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మార్కెట్లు సాధారణస్థితిలో పనిచేయడాకి, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ఒత్తిడిని నివారించడానికి రిజర్వుబ్యాంకు తీసుకున్న చర్యలు దోహదం చేస్తాయన్నారు.