ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట ప్రముఖ జాతీయ క్రీడాకారుని ఆత్మహత్యతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లబొప్పాపూర్ గ్రామంలో విషా దం నెలకొంది. జూన్ 30న పురుగుల మం దు తాగడంతో భుజంకార్ శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్‌లో చికిత్స పొందు తూ మరణించాడు. వివరాల్లోకి వెళితే.. రెజ్లింగ్‌పై ఉన్న ఆసక్తితో బాధిత శ్రీనివాస్ అందులో శిక్షణపొందాడు. తన ప్రతిభా పాఠవాలతో జాతీయ స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. గత కొంతకాలంగా క్రీడలకు ఆదరణ కరువు కావడంతో మాంసం వ్యాపారంలో ముగ్గురు అన్నదమ్ములకు సహాయంగా ఉన్నాడు. అందరితో సోదరభావంతో మెలిగే శ్రీనివాస్ గతనెల 30న కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలుపుకొని తాగినట్లు తెలిసింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ నుండి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెజ్లింగ్ జాతీయ కార్మికుడు ఆత్మహత్య
RELATED ARTICLES