తొలిరోజే సైనా ఇంటికి
హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సీరిస్ 500 టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, రియో ఓలంపిక్ విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. హాంకాంగ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన నిచ్చాన్ జిండాల్‌పై పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం వరల్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న పీవీ సింధు నిచ్చాన్ జిండాల్‌పై 21-15, 13-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధు చేతిలో నిచ్చాన్ జిండాల్‌కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. తాజా విజయంతో పివీ సింధు రెండో రౌండ్‌లోకి అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా పీవీ సింధు రెండో రౌండ్‌లో కొరియాకు చెందన సుంగ్ జీ హుయన్‌తో తలపడనుంది. రెండో రౌండ్‌లో పీవీ సింధు విజయం గనుకు సాధిస్తే క్వార్టర్స్‌లో చైనాకు చెందిన హిబింజియోతో తలపడాల్సి ఉంటుంది. మరో షట్టర్ సైనా చైనాకు చెందిన కౌ యాన్ యాన్ తో తలపడి 13-21, 20-22తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకు ప్లేయర్ అయిన సైనా పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. గడిచిన ఆరు టోర్నమెంట్లలో ఐదింటిలో తొలి రౌండ్లోనే తప్పుకుంది. కాగా, చైనాకు చెందిన కై యాన్ యాన్ తో వరుసగా రెండో సారి ఓడిపోయింది. గేమ్ ఆసాంతం పోటాపోటీగా సాగినప్పటికీ చైనీస్ ప్లేయర్ విసిరిన ఛాలెంజ్ ఎదుర్కోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మకు నిరాశ తప్పలేదు. తైవాన్ కు చెందిన జు వీ వాంగ్ చేతిలో 11-21, 21-13, 8-21తేడాతో ఓడిపోయాడు.
రెండో రౌండ్‌లో సింధు
RELATED ARTICLES