అర్థ శతకంతో చెలరేగిన రాహుల్
రాణించిన శ్రేయాస్ అయ్యర్
ఏడు వికెట్ల తేడాతో కివీస్ చిత్తు
సిరీస్ 2-0 ఆధిక్యంలో టీమిండియా
ఆక్లాండ్ : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా. ఓపెనర్ శర్మ(8) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. మిగతా బ్యాట్స్‌మెన్స్ చక్కగా రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ కివీస్ బౌలర్ల భరతం పట్టారు. ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 50 బంతులను ఎదుర్కొన్న రాహుల్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతనికి తోడుగా ఉన్న కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కేవలం 33 బంతులను ఎదుర్కొన్న అయ్యర్..1 ఫోర్, 3 సిక్స్‌ల సహాయంతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దూబే (8) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో భారత్ 7 వికెట్లతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా, ఇది రికార్డు విజయం. భారత్ పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన దాఖళాలు లేవు. కానీ, ఈ మ్యాచ్ గెలుపుతో ఆ అరుదైన రికార్డును కోహ్లీసేన తమ ఖాతాలో వేసుకుంది.
చెలరేగిన భారత బౌలర్లు..
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలా్‌ండ మొదటి (బ్యాటింగ్) పవర్‌ప్లేలో అదరొగొట్టింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రోలు జట్టుకు పవర్‌ప్లేలో మంచి స్కోర్ అందించారు. పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి ఓవర్లో గుప్టిల్ రెండు భారీ సిక్సులు బాది హెచ్చరికలు జారీ చేసాడు. అయితే రెండో ఓవర్లో మహమద్ షమీ 5 పరుగులే ఇచ్చి కివీస్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసాడు. గుప్టిల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటింగ్ పవర్‌ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి న్యూజిలా్‌ండ 1 వికెట్ నష్టానికి 48 పరుగలు చేసింది. గుప్టిల్ పెవిలియన్ చేరిన అనంతరం మున్రో కొన్ని షాట్లు ఆడి స్కోర్ వేగం పెంచాడు. అయితే శివమ్ దూబే వేసిన 9వ్ ఓవర్లో గప్తిల్ భారీ షాట్ ఆడగా.. సర్కిల్ లోపలే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. జడేజా వేసిన 11వ ఓవర్ రెండో బంతికి అతనికే క్యాచ్ ఇచ్చి గ్రాండ్‌హోమ్ ఔట్ అయ్యాడు. భారత బౌలర్లు చెలరేగడంతో క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ఉన్నా ధాటిగా బ్యాటింగ్ చేయాలేకపోయారు. స్కోర్ వేగం పెంచే క్రమంలో జడేజా 13వ ఓవర్ మూడో బంతికి విలియమ్సన్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో కీలక నాలుగు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో టిమ్ సీఫెర్ట్ అండతో టేలర్ పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. టేలర్ భారీ షాట్లు ఆడినా.. బౌండరీలుగా మలచలేకపోయాడు. అయితే సీఫెర్ట్ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోర్ వేగం పెంచాడు. ధాటిగా ఆడే క్రమంలో టేలర్ (18) చివరి ఓవర్ నాలుగో బంతికి నిష్క్రమించాడు. సీఫెర్ట్ ఐదో బంతికి సిక్స్ బాది న్యూజిలాండ్‌కు మోస్తరు స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో జడేజా (2/18), దుబె (1/16), ఠాకూర్ (1/21), బుమ్రా (1/21)లు ఆకట్టుకున్నారు.
రాహుల్ హాఫ్ సెంచరీ..
కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఆరో ఓవర్ రెండో బంతికి సౌతీ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఔట్ అయినా.. రాహుల్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మొదటగా స్లోగా బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఆపై రెచ్చిపోయాడు. మరోవైపు రాహుల్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు. 16వ ఓవర్లో అయ్యర్ వరుసగా సిక్స్, ఫోర్ బాది టీమిండియాను లక్ష్యానికి చేరువ చేసాడు. 7వ ఓవర్ రెండో బంతికి మరో సిక్స్ బాదిన అయ్యర్.. ఆ తర్వాత బంతికి మరో భారీ షాట్ ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అయ్యర్ ఔట్ అయ్యే సమయానికి భారత్ విజయానికి కేవలం 8 పరుగులే కావాలి. శ్రేయాస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే (8 నాటౌట్).. సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, సోదీ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, హామిల్టన్ వేదికగా బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
రెండో టి20లో భారత్ ఘనవిజయం
RELATED ARTICLES