హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి స్మిత్
సిడ్నీ : స్టీవ్ స్మిత్ (80 నాటౌట్; 51 బంతుల్లో 11 పోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో కాన్‌ె్బర్రా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. పెర్త్ వేదికగా శుక్రవారం మూడో టీ20 జరగనుంది. గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20కి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో కెప్టెన్ బాబర్ అజామ్ (50), ఇఫ్తికర్ అహ్మద్ (62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా… మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆస్టన్ రెండు వికెట్లు తీయగా… ప్యాట్ కమిన్స్, రిచరడ్స్‌న్‌లకు చెరో దక్కింది. అనంతరం 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన టీ20 సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్ డేవి్‌డ వార్నర్(20)ను జట్టు స్కోరు 30 పరుగుల వద్ద మహ్మద్ ఆమీర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ ఆరోన్ ఫించ్ (17) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ మెక్‌డోర్మెట్ (21)తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత నెమ్మదిగా ఆడిన స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 18.3 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రెండో టి20లో ఆసీస్ విజయం
RELATED ARTICLES