ఆసీస్ ముందు ఈజీ టార్గెట్!
ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆ స్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పేలవ బ్యాటింగ్‌తో ఓటమి ముంగిట నిలిచింది. 89 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.3 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా (142 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 59) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణం గా విఫలమయ్యారు. లయన్(8/64) ఎనిమిది వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. మిచె ల్ స్టార్క్, మాథ్యూ కుహ్నేమన్ తలో వికెట్ తీసా రు. ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. మూడో రోజు ఆటలో భారత స్పిన్నర్లు అద్భుతం చేస్తే తప్పా రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. తొలి సెషన్ మినహా రెండు సెషన్లలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. 11 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు చివరి 6 వికెట్లను కోల్పోయిం ది. ఉస్మాన్ ఖవాజా(60), మార్నస్ లబుషేన్ (31), కామెరూన్ గ్రీన్(21) టాప్ స్కోరర్లుగా ని లిచారు. దాంతో ఆసీస్‌కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(5), రోహిత్ శర్మ(33 బంతుల్లో 12) శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. లయన్ బౌలింగ్‌లో ధాటిగా ఆడే క్రమంలో గిల్ క్లీన్ బౌల్డ్ కాగా.. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7) వరుసగా ఔటయ్యారు. ఈ ప రిస్థితుల్లో పుజారాతో కలిసి శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) అటాకింగ్ గేమ్ ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్.. మిచెల్ స్టార్క్ సాయంతో విడదీసాడు. ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు అయ్యర్ వెనుదిరిగాడు. వెంటనే శ్రీకర్ భరత్(3) పేలవ రీతిలో క్లీన్ బౌల్డ్ అవ్వగా.. రవిచంద్రన్ అశ్విన్(16) ల యన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఒంటరిపోరాటం చే యగా.. లయన్ అతన్ని పెవిలియన్ చేర్చాడు. స్మి త్ స్టన్నింగ్ క్యాచ్‌కు పుజారా ఔటయ్యాడు. ఆ త ర్వాత వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ షాట్ ఆడబో యి పెవిలియన్ చేరగా.. సిరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యా డు. దాంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. మరోసారి అక్షర్ పటేల్(15 నాటౌట్) అజేయంగా నిలిచాడు.