మద్యం డిపోల నుండి కొనుగోలు చేసిన షాపులు
తొలిరోజున సగటున మూడింతల సేల్స్
దుకాణాల ముందు రెండో రోజు తగ్గిన క్యూలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షల నుండి బయటపడి తెరుచుకున్న మద్యం షాపుల్లో రెండు రోజులుగా భారీగానే విక్రమాలు జరిగాయి. ఒక్కో షాపు మామూలు రోజు కంటే మూడింతలకుపైనే అమ్మకాలు జరిపినట్లు అంచనా. గడిచిన రెండు రోజుల్లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ మద్యం డిపోల నుండి వైన్ షాపులు సుమారు రూ.230 కోట్ల విలువైన వివిధ రకాల మద్యంను కొనుగోలు చేసినట్లు సమాచారం. సడలింపు తొలగిన తొలిరోజున రూ.72 కోట్లు, రెండో రోజైన గురువారం మధ్యాహ్నం వరకు సుమారు రూ.160 కోట్ల వరకు డిపోల నుండి వైన్ షాపుల యజమానులు కొన్నట్లు తెలిసింది. మద్యం షాపుల వద్ద తొలిరోజున వినియోగదారులు పోటెత్తడంతో భారీ క్యూలు కనిపించాయి. అయితే రెండో రోజున మాత్రం ఆ స్థాయిలో లేవు. వైన్ షాపుల ముందు తక్కువ మందే కనిపించారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షల నుండి రూ.4లక్షల అమ్మకాలు ఉండే షాపుల్లో బుధవారం నాడు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరిగినట్లు సమాచారం. అయితే, సేల్స్ జరిగిన మొత్తం డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్లదు. అందులో సుమారు పావు వంత తయారీ కంపెనీలకు, మరో 20 శాతం వరకు వైన్స్‌కు, వివిధ బ్రాండ్‌లను బట్టి 40 శాతం వరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయని అంచనా.
రెండు రోజుల్లో రూ.230 కోట్లు
RELATED ARTICLES