చారిత్రక విజయానికి చెరువైన భారత్, ఆసీస్ లక్ష్యం 399, ప్రస్తుతం 258/8, పోరాడుతున్న కమ్మిన్స్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయానికి చెరువైంది. మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియాకు విజయం వరిస్తోంది. భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. బౌలర్లు చెలరేగడంతో నాలుగో రోజే భారత్ గెలుస్తోందని అందరూ భావించగా.. కమ్మిన్స్ అసాధరణ బ్యాటింగ్‌తో భారత్ విజయాన్ని అంతరాయం కలిగిస్తున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన పాట్ కమ్మిన్స్ (61 బ్యాటింగ్; 103 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన తాను మాత్రం పిచ్‌పై నిలబడి ఆసీస్ ఆశలను సజీవంగా ఉంచుతున్నాడు. ఈ టెస్టు గెలువాలంటే టీమిండియాకు రెండు వికెట్లు అవసరం ఉండగా.. అదే ఆసీస్‌కు 141 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కమ్మిన్స్‌తో పాటు నాథన్ లియాన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. ఆసీస్ టాప్ ఆర్డర్‌లో షాన్ మార్ష్ (44), హెడ్ (34), ఖవాజా (33) పరుగులు చేశారు. 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను కమ్మిన్స్ ఇతర బ్యాట్స్‌మెన్ల సహకారంతో నెట్టుకొస్తున్నాడు. ఈ కీలక వికెట్‌ను త్వరగా పడగొట్టి కోహ్లీ సేన చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. శనివారం రెండో ఇనింగ్స్‌లో భారత్ 108/6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్స్ మయాంక్ అగర్వాల్ (42), రిషభ్ పంత్ (33) పరుగులతో రాణించారు. తర్వాత భారత కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి ఆసీస్ ముందు 399 పరుగుల లక్ష్యం ఉంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కంగారూ బ్యాట్స్‌మెన్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సమయోచితంగా ఆడుతున్నారు.
రెండడుగుల దూరంలో..
RELATED ARTICLES