ఉద్యోగాల పేరిట మోసం
విస్డం కంపెనీ గుట్టురట్టు
ప్రపంచ వ్యాప్తంగా బాధితులు
సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో మరో ఘరానా మోసం వెలుగు చూసిం ది. ఉద్యోగాల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందిని మో సం చేసి 70 కోట్ల రూపాయలు వసూలు చేసిన విస్డం కంపెనీ గుట్టురట్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు. రెజ్యూమ్ తయారు చేయడం, వాటిని ప్రముఖ కంపెనీలకు పంపించడం, అవి గుర్తింపు పొందేలా చూడటం వంటి ప్రకటనలతో రెండు వెబ్‌సైట్‌ల ద్వారా 2.85 కోట్ల మందిని తమ కస్టమర్లుగా ఈ ఫ్రాడ్ కంపెనీ రిజిస్టర్ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భారతదేశంతో పాటు మిడిల్ ఈస్ట్ సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఖతార్, నెదర్‌ల్యాండ్స్, జార్డన్, లెబనాన్, యుకె, శ్రీలంక, ఆస్ట్రేలియ, మలేషియా దేశాలలో కూడా ఈ కంపెనీకి బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రూ. 70 కోట్ల దగా
RELATED ARTICLES