ముంబయి: దలాల్ స్ట్రీట్‌లో శుక్రవారం షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం ఎంత భారీగా మార్కెట్లు పతనం అయ్యా యో… అంతకంటే వేగంగా ఈ శుక్రవారం పతనమయ్యాయి. సెన్సెక్స్ 893.99 పాయిం ట్లు లేక 2.32 శాతం మేరకు పతనమై 37,576.62 వద్ద స్థిరపడింది. కాగా నిఫ్టీ 279.55 పాయింట్లు లేక 2.48 శాతం మేర కు పతనమై 10,989.45 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఒక దశలో సెన్సెక్స్ 1,400 పాయిం ట్ల మేరకు నోస్‌డైవ్ చేసి పడిపోయింది. తర్వాత మార్కెట్ చివరి నిమిషాల్లో కాస్త కోలుకుందనే చెప్పాలి. ఒక్క రోజులోనే రూ. 3.30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. బిఎస్‌ఇలో లిస్టయిన సంస్థల మా ర్కెట్ మూలధనం శుక్రవారం రూ. 144.3 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది గురువారం రూ. 147.6 లక్షల కోట్లుగా ఉంది. నిఫ్టీ 50 షేర్లలో 5 పెరిగితే, 45 పతనమయ్యాయి. బ్యాంకింగ్ కౌంటర్లలోనైతే అమ్మకాలు వెల్లువెత్తాయి. యెస్ బ్యాంక్ షేరయితే 55 శాతం మేరకు నష్టపోయింది. యెస్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ రుణస్థగనం లేక అప్పు నిలుపుదల(మోరటోరియం) విధించడంతో మార్కెట్‌లో ఆ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఆ షేరు దాదాపు 85 శాతం కుప్పకూలి రూ. 5.65 వద్ద… 52 వారాల కనిష్ఠం వద్ద ట్రేడయింది. తర్వాత పుంజుకుని అది ఎన్‌ఎస్‌ఇలో 16.15 వద్ద (- 56.11 శాతం డౌన్) ముగిసింది. యెస్ బ్యాంక్‌కు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్‌తో మాట్లాడానన్నారు. సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్‌బిఐ కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బిఐ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం యెస్ బ్యాంక్ ఖాతాదారులు రూ. 50వేల వరకు తీసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యమన్నారు. సెన్సెక్స్‌లో బజాజ్ ఆటో, మారుతి, ఏషియన్ పెయింట్స్ మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి. ఎస్‌బిఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జిసి షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. యెస్ బ్యాంక్ పునరుద్ధరణకు ఆర్‌బిఐ ముసాయిదా ప్రణాళికను ప్రకటించింది. రికన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్‌లో ఎస్‌బిఐ దాదాపు రూ. 2,450 కోట్లు…అంటే దాదాపు 49 శాతం పెట్టుబడిపెట్టనుంది. ముసాయిదా ప్రణాళికపై తమ వ్యాఖ్యలు తెలిపేందుకు ఆ ముసాయిదాను ఎస్‌బిఐకి, యెస్ బ్యాంక్‌కు కూడా ఆర్‌బిఐ పంపించింది. రీకన్‌స్ట్రక్టెడ్ యెస్ బ్యాంక్‌లో ఇప్పుడున్న జీతానికే ఉద్యోగులందరిని కనీసం సంవత్సరంపాటు కొనసాగనిస్తారు. రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్‌లో ఆథరైజ్డ్ కెపిటల్‌ను రూ. 5,000 కోట్లకు మార్చే ప్రణాళిక కూడా ఆర్‌బిఐకి ఉంది. రూ. 2 చొప్పున ఈక్విటీ షేర్లను కూడా మార్చి ఇప్పుడున్న రూ. 24,000 కోట్లను రూ. 48,000 కోట్లకు పెంచనున్నారు.
రూ. 3.30 లక్షల కోట్లు ఆవిరి
RELATED ARTICLES