దేశంలో మరో భారీ జిఎస్‌టి మోసం బట్టబయలు
నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడిన పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్
కాన్పూర్: దేశంలో మరో భారీ జిఎస్‌టి మో సం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన పీయూష్ జైన్ అనే పర్ఫ్యూమ్ వ్యాపారి తప్పుడు బిల్లులతో పాల్పడిన భారీ పన్ను ఎగవేతను జిఎస్‌టి, ఐటి అధికారులు బయటపెట్టారు. నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడి పీయూష్ కూడబెట్టిన దాదాపు రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. గురువారం దాడులు నిర్వహించిన అధికారులు శుక్రవారం ఉదయం వరకు లెక్కించి ఆ డబ్బు విలువను రూ.150 కోట్లుగా తేల్చారు. కౌం టింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) చైర్మన్ వివేక్ జోహ్రి వివరించారు. సిబిఐసి చరిత్రలో నే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బయటపడ టం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. వ్యాపారవేత్త పీయూష్ జైన్‌కు చెందిన త్రిమూర్తి ఫ్రాగ్రెన్స్‌కు సంబంధించి వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. శిఖర్ పాన్ మసాలా కంపెనీ యజమాని ప్రవీణ్ జైన్‌కు చెందిన పలుచోట్ల కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. పాన్ మసాలా, త్రిమూర్తి కంపెనీ గుట్కా తయారుచేసి ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా పన్ను కట్టకుండా ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు. పీయూష్ జైన్ ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలను కూడా అధికారులు గుర్తించారు. ఆయన నోట్ల కట్టలను రెండు బీరువాల్లో నిండా పేర్చారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పీయూష్ ఇంట్లోనే కుప్పలుగా పోసి లెక్కించారు. ఆ నోట్లను తరలించేందుకు పదుల సంఖ్యలో భారీ పెట్టెలను కూడా సిద్ధం చేశారు. పీయూష్ జైన్ కుమారుడు ప్రత్యూష్ జైన్ అధికారులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, పీయూష్.. సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు. ఈ కేసుకు సంబంధించి కాన్పుర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ సమాజ్‌వాది పార్టీతో సంబంధం ఉన్న నేత ఇంట్లో భారీగా డబ్బులు బయటపడడం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయ కలకలం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
రూ. 150 కోట్ల నల్లధనం
RELATED ARTICLES