బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారి జాబితాలో అందరూ పెద్ద తలకాయలే!
న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే రు ణాలను ఎగ్గొట్టిన ‘మింగుడుగాళ్ల’ జాబితాను ఆ లిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఈఎ) విడుదల చేసింది. బ్యాంకుల జాతీయీకరణ 51 వార్షికోత్సవం పురస్కరించుకొని, ఎఐబిఇఎ వివిధ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన 2,426 ఖాతాదారుల జాబితాను బయటపెట్టింది. అన్ని జాతీయ బ్యాంకుల్లో మొత్తంగా 1,47,350 కోట్ల రూపాయల మేరకు మొండిబకాయిలు వున్నాయి. బకాయిల్లో ఎస్‌బిఐదే సింహభాగం. దీంట్లో 685 మంది ఖాతాదారులకు చెందిన 43,887 కోట్ల రూపాయల బకాయిలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి చెందినవే. తదుపరి స్థానాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండి యా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు నిలిచా యి. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీన సెంట్రల్ రెపోసిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సిఆర్‌ఐఎల్‌సి) విడుదల చేసిన నివేదిక ఆధారంగా విల్‌ఫుల్ డిఫాల్టర్లు (ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు) జాబితాను ఎఐబిఇఎ తయారు చేసింది. ఈ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో ఎక్కువశాతం బడా కంపెనీలు, ప్రముఖులే వున్నారని, వీరిపై క్రి మినల్ చర్యలు తీసుకోవాలని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశా రు. బకాయిలు చెల్లించడానికి బడాబాబులందరికీ తగినన్ని ఆస్తులున్నాయ ని, బ్యాంకులు ఎందు కు ఇబ్బంది పడాలని ఆ యన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అలక్ష్య మే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ఈ కేసులు ఎన్‌సిఎల్‌టికి వెళ్ల కూడదని, ఈ ఉద్దేశపూర్వ క ఎగవేతదారుల నుంచి డబ్బులు, ఆస్తులు స్వాధీ నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీలు ప్రారంభించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించడంతోపాటు పారిశ్రామి క వృద్ధిని పెంపొందించే ఉద్దేశంతో బ్యాంకుల నుంచి రుణాలు మంజూ రు చేయిస్తే, ఆ మొత్తాన్ని పారిశ్రామికవేత్తలు ఉద్దేశపూర్వకంగా మిం గేశారు. ఎగవేతదారులంతా ప్రైవే టు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన బడా వ్యక్తులే. రూ.5 కోట్ల నుంచి రూ.500 కోట్లపైన బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని చెల్లించకుం డా తిరుగుతున్న ఖాతాలను ఇటీవల లోక్‌సభ సైతం విడుదల చేసిన విషయం తెల్సిందే. గతేడాది సెప్టెంబరు వరకు అక్షరాలా రూ.1,45,350 కోట్లపైనే ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వమే వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాం కులు ఈ మొత్తాన్ని కేవలం 2,426 మంది పారిశ్రామికవేత్తలకే ఇవ్వడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. దేశంలో మొత్తం 17 ప్రధాన బ్యాం కులు ఇచ్చిన పారిశ్రామిక రుణాలు, ఆ సంస్థల యజమానులు ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన బాకీల వివరాలను సెంట్రల్ రెపోసిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సిఆర్‌ఐఎల్‌సి) పార్లమెంట్‌కు నివేదించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ మినహా మిగిలిన బ్యాంకులన్నీ ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన బకాయిదారులు, వారు తీసుకున్న రుణాల వివరాలను సమర్పించాయి. వీటిపై రిజర్వు బ్యాంకు పలుమార్లు సమీక్ష నిర్వహించినా నేటికీ, ఆ మొండి బకాయిలు వసూలు కాకపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది.