ఈనెల 7న కేరళను తాకే అవకాశం
న్యూఢిల్లీ: ముందుగా వేసిన అంచనాల ప్రకారం ఈనెల 4వ తేదీన కేరళను తాకాల్సిన నైరుతీ రుతుపవనాలు ఆలస్యమవుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఈనెల 7న కేరళను తాకే అవకాశాలు ఉన్నట్టు తాజా అంచనాల్లో పేర్కొం ది. అరేబియా సముద్రంలో గాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అందువల్ల రుతుపవనాలు తేదీ తప్పినప్పటికీ త్వరలోనే కేరళకు వస్తాయని ఐఎండి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలో పశ్చిమ గాలులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలం గా మారాయని పేర్కొంది. అలాగే, పశ్చిమ గాలుల లోతు క్రమంగా పెరుగుతోందనీ, జూన్ 4న సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని తెలిపింది. ‘ఆగ్నే య అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి ఈ అనుకూల పరిస్థితులు మరింత మెరుగుపడతాయని అనుకుంటున్నాము’ అని వాతావరణ కేంద్రం ఆ ప్రకటనలో వివరించింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామనీ, ఎప్పటికప్పు డు తాజా సమాచారాన్ని అందిస్తామని తెలిపింది. 2022 మే 29న, 2021 జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కాగా, ఈ సారి కాస్త ఆలస్యం అవుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రుతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో వాతావరణ శాఖ ప్రకటించలేదు.
రుతుపవనాలుఆలస్యం..
RELATED ARTICLES