రైతురుణ మాఫీ తరహాలో రూ.30 కోట్ల చేనేత రుణమాఫీ చేస్తాం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెడతామని ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవులను త్యాగం చేస్తే, కొందరు ఎలక్షన్స్, కలెక్షన్లు, సెలక్షన్లతో ఉప ఎన్నికల పేరుతో కోట్లు సంపాదించారని బిఆర్‌ఎస్‌పై పరోక్షంగా ఆరోపించారు. గ తంలో ఆర్భాటం, సినీ తారల తళుకు బెళుకులు తప్ప, నేతన్న ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదన్నారు. రైతురుణమాఫీ చేసినట్లుగానే రూ.30 కోట్లు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేసి, చేనేత కా ర్మికులను రుణ విముక్తులను చేస్తామని, ఇందుకు తక్షణమే రుణమాఫీపై జిఒను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించా హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు లలిత కళాతోరణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టిఎస్‌ఎండిసి చైర్మన్ అనిల్, ఎంఐఎం ఎంఎల్‌ఎ మాజీద్, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులతో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టె సిఎం రేవంత్‌రె డ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సం దర్భంగా చేనేత అభయహస్తం లోగోను ఆయన ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతానికి తాత్కాలికంగా తెలుగు యూనివర్సిటిలోనే ఈ ఏడాది ఐఐహెచ్‌టి తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని, రంగారెడ్డి జిల్లాలో (ముచ్చర్ల ) స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక పూర్తిస్థాయిలో అక్కడే ఐఐహెచ్‌టిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు ఇప్పటి వరకు ఐఐహెచ్‌టిలో చేరాలంటే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్టానికో, లేదా ఒడిశాకో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటేనన్నారు.
పదేళ్లుగా గత ప్రభుత్వం ‘ఇన్‌స్టిట్యూట్’ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు:
‘రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు పదేళ్లుగా గత ప్రభుత్వం చర్యలు తీసుకోనే లేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఐఐహెచ్‌టి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం హంగు, ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని దుయ్యబట్టారు. ఈ కారణంగా చేనేతల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కేంద్రంలో ఏటా 60 మందికి టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ కేంద్రంలో అధునాతన పరిశోధన అవకాశాలు కల్పించనున్నామని తెలిపారు.
నేతన్నచేయూతకు రూ.290 కోట్ల చెక్కు :
నేతన్న చేయూత పథకానికి సంబంధించి రూ.290 కోట్ల చెక్కును జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చేనేత పొదుపు లబ్ధిదారులకు సిఎం రేవంత్ రెడ్డి పలు చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నామినీలకు కూడా భీమా చెక్కులు అందించారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందని, కానీ తాము బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల చేనేత కార్మికులను కూడా ఆదుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని, ఏడాదికి ఒక్కో సభ్యురాలికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఏటా రెండు చీరలు మహిళా పొదుపు సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణను సిద్ధం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏటా రెండు చీరలు పొదుపు సంఘాల మహిళలకు ఇప్పిస్తామని, ఇందుకు ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇవ్వనున్నామని వివరించారు. గత ప్రభుత్వం పవర్‌లూమ్ రంగానికి ఉపాధి కల్పించే ఉద్ధేశంతోనే ఏమాత్రం కూడా నాణ్యత లేని బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని, అందుకు బదులుగా తమ ప్రభుత్వం మహిళ పొదుపు సంఘాలకు ఏటా రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అనంతరం చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పరిష్కరించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చేనేతల ట్రేడ్ మార్క్ కోసం ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర శాఖలో పని చేస్తున్న శైలజా రామయ్యర్‌ను ప్రత్యేకంగా చేనేత, జౌళికి శాఖ బాధ్యతలు కూడా అప్పగించామని, చేనేత కారులు తమ సమస్యలను నేరుగా తనకు గానీ, లేదా శైలజారామయ్యర్‌కు దృష్టికి తీసుకువచ్చినా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తెలంగాణలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వల్ల చేనేత కుటుంబాల పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి సదుపాయాలు
మరిన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు.