ప్రజాపక్షం/బషీర్‌బాగ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. ‘రిజర్వేషన్ల పరిరక్షణ వ్యవస్థల పాత్ర” అనే అంశంపై బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్దారక భవన్‌లో సదస్సు జరిగింది. అసమానతలు , వివక్షను సహించలేకనే అత్యధిక శాతం నిమ్న వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారని వక్తలు అన్నారు. నేటి ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్లను తొలగించడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. అగ్రవర్ణాలు కొలువు దీరిన అన్నీ విభాగాల్లోని శక్తులు నిరంతరం ఇందుకోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి, బిసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో రిజర్వేషన్లు విస్తరించాలని, అందుకు తగు కార్యాచరణ రూపొందిస్తామని వక్తలు అన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ ఎవరి చేతుల్లో పాలన అవకాశం ఉంటే రిజర్వేషన్ల అమలును తమ ఇష్టానుసారం అమలు చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎస్‌సి, ఎస్‌టి, బిసిల రిజర్వేషన్లపై సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందన్నారు. న్యాయస్థానాల్లోనూ అత్యధిక కేసుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు వ్యతిరేకంగానే తీర్పులొచ్చాయని జాతీయా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య గుర్తుచేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పాథమిక హక్కులు కల్పించిందన్నారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కిందకు రాదని ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం దేశంలోని 90శాతం మంది ప్రజలను అవమానించడంగానే భావిస్తున్నామన్నారు.
రిజర్వేషన్ల జోలికి వచ్చారో…
RELATED ARTICLES