ఉనాద్కట్, సామ్ కరన్, శివమ్ దూబేలకు జాక్‌పాట్
ఐపిఎల్ సీజన్-12 వేలంపాటు
జైపూర్: ఐపిఎల్ సీజన్ కోసం నిరహించిన వేలంపాటులో కొందరికి అదృష్టం వరించి రికార్డు ధరలు పలికితే.. మరి కొందరికి నిరాశలే మిగిలాయి. కొత్త సీజన్ 2018 కోసం బిసిసిఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఐపిఎల్ వేలంలో వివిధ జట్ల ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఈ సీజన్ కోసం మిగిలిన 70 మంది స్థానాల కోసం మొత్తం 346 మంది ప్లేయర్లు పోటీ పడ్డారు. అయితే కొందరూ అంచనాలు లేకుండానే కోటీశ్వరులయ్యారు. మరికొందరూ స్టార్ ప్లేయర్లుగా రాణిస్తున్నా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయారు. ‘పింక్ సిటీ’ జైపుర్‌లో జరిగిన వేలంలో తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సంచలనం సృష్టించాడు. అసలు అంచనాలు లేకుండా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వరుణ్‌కి అదృష్టం వరించింది. రూ. 8.4 కోట్లు పెట్టి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. మరోవైపు పేస్ బౌలర్ ఉనాద్కత్‌ను (రూ. 8.4 కోట్ల)కు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా రికార్డు ధర పలికాడు. ఇటీవలే తన బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న దూబేను రూ. 5 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా వేలంలో భారీ ధరను పలికాడు. కరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 7.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మంగళవారం జరిగిన వేలంలో సామ్ కరన్ అత్యధిక ధరపలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కొలిన్ ఇన్‌గ్రామ్‌ను రూ. (6.4 కోట్ల)కు ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది. తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన యువరాజ్ సింగ్‌ను చివరికి కోటి రూపాయాలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా అదృష్టం వరించింది. అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. మోహిత్ శర్మను రూ. 5 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్ దక్కించుకుంది. వికెట్ కీపర్ వృద్ధమాన్ సహాకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గతకొంతకాలంగా నిలకడగా ఆడుతున్న తెలుగు రాష్ట్ర ఆటగాడు హనుమ విహారిని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. విహారి కనీస ధర రూ. 50 లక్షలు కాగా అతనిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు వేలంలో పోటీపడి దక్కించుకుంది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ రూ. (4.8 కోట్ల)కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.
రికార్డు ధర పలికిన వరుణ్ చక్రవర్తి
RELATED ARTICLES