హత్రాస్ అత్యాచార ఘటన బాధితురాలు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం
తోపులాటలో కిందపడిపోయిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ దళిత యువతి హత్యా చార ఘటనపై ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హత్రాస్ పర్యటన ఉద్రి క్తతకు దారితీసింది. మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద అడ్డుకున్న పోలీసులు రాహుల్, ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. అంతకముందు గ్రేటర్ నోయిడా వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో.. నేతలిద్దరూ దిగి కాలినడకన బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపు లాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. పోలీసుల తీరు పై రాహుల్, ప్రియాంక తీవ్రంగామండిపడ్డారు. ఈ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. కేవలం ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు మాత్రమే రోడ్డుపై నడవాలా? అని నిలదీశారు. తొలుత రాహుల్ హత్రాస్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు సెక్షన్ 188 కింద అరెస్టు చేస్తున్నట్టు రాహుల్‌కు చెప్పారు. ఎపిడమిక్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అడ్డుకున్నట్టు నోయిడా ఎసిపి తెలిపారు. ఆయన్ను ముందుకు వెళ్లనీయబోమన్నారు. అందుకు స్పందించిన రాహుల్.. తానొక్కడినే నడిచి వెళ్తానని, అడ్డుకోవద్దని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, హత్రాస్‌కు పాదయాత్రగా వెళ్తున్న రాహుల్, ప్రియాంకను పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుసరించారు. వారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హత్రాస్‌కు వెళ్లేందుకు యమునా ఎక్స్‌ప్రెస్ వే పై నుంచి వెళ్తున్న సమయంలో ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్ల దళిత యువతపై జరిగిన అత్యాచార ఘటనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధ్యత తీసుకోవాలన్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమెడి డిమాండ్ చేశారు. తీవ్ర గాయాలైన యువత ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తమ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తాము హత్రాస్‌కు పాదయాత్రగా వెళ్తున్నామని ప్రియాంక చప్పారు. తాము బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించాలని అనుకుంటున్నామని, తమ సంఘీభావాన్ని తెలుపాలనుకుంటున్నామని ప్రియాంక అన్నారు. సిఎం మహిళల రక్షణకు ఏదైనా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలోని మమహిళలందరూ తమ రక్షణ కరువైందని తెలుసుకున్న నాడు ఒక్కసారిగా పోరాటాలు ఉధృతమవుతాయన్నారు. నిత్యం రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, ప్రతి రోజు 11 కేసులు రికార్డు అవుతున్నాయని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో కూడా ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కోసం తమ పార్టీ ఆందోళనకు దిగిందన్నారు. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నాయకులు పర్యటించడానికి ముందు హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. నోయిడా నోయిడా ఎక్స్‌ప్రెస్‌పై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బారికేడ్లను ఏరాటు చేశారు. ఢిల్లీ నుంచి యుపి సరిహద్దుల్లోకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దాదాపు వంద వహనాల్లో రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యుపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పర్యటన ఉద్రిక్తం
RELATED ARTICLES