టెస్టు జట్టుల్లో రాహుల్ స్థానం గల్లంతు..
ఓపెనింగ్‌లో రోహింత్‌ను ఆడించాలని యోచనలో సెలెక్టర్లు
ముంబయి : స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్‌పై వేటు పడింది. వరుస మ్యాచ్‌లలో ఆశించినంత రాణించకపోవడంతో సెలెక్టర్లు అతనిపై వేసువేసినట్టు తెలుస్తోంది. ముందు జరగబోయే సఫారీలతో సిరీస్‌లకు అతన్ని పక్కనబెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్ స్థానంలో ’హిట్‌మ్యాన్’ ఓపెనర్ రోహిత్ శర్మను తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఓపెనర్‌గా రోహిత్‌ను తీసుకునే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా ఎమ్మెస్కే పైవిధంగా స్పందించారు. సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ విషయం గురించి మాట్లాడతామని కూడా ఆయన తెలిపారు. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ… ’వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. త్వరలో జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ టూర్‌లో ఓపెనర్‌గా రాహుల్ పేలవమైన ప్రదర్శన చేయడంతో రోహిత్‌వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం అయింది.
పేలవ ప్రదర్శనే కారణం..
కెఎల్ రాహుల్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. కానీ విండీస్ పర్యటనలో అతను పేలవ ప్రదర్శన చేశాడు. రాహుల్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అంతగా రాణించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం రాహుల్ టెస్టు క్రికెట్‌లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రీజులో ఎక్కువ సమయం కేటాయిస్తూ.. తిరిగి ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి’ అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ‘టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌కు అవకాశం ఇవ్వాలని. టెస్టుల్లో ఓపెనర్‌గా అతడు సరిగ్గా సరిపోతాడని’ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవల సూచిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్టులో రాహుల్ విఫలమయ్యాడు. 44, 38, 13, 6 పరుగులు చేసాడు. తొలి టెస్టులో మంచి పరుగులే చేసినా.. భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. ఇక రెండో టెస్టులో 19 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. రాహుల్ ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో చేసిన 149 పరుగులే అత్యుత్తమం. ఆడిన చివరి 12 ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేదు.
విహారి స్థానం పదిలం..
మరోవైపు ఆరో స్థానంలో తెలుగు తేజం హనుమ విహారి అద్భుతంగా ఆడాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సెంచరీ, అర్ధ సెంచరీతో విజృంభించాడు. దీంతో అతడికి ఆ స్థానం కన్ఫామ్ అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మిడిలార్డర్‌లో విహారి చక్కని ప్రదర్శన ఇవ్వడంతో.. ఆరో స్థానం సమస్య తీరినట్టేనని సీనియర్ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ ఫర్వాలేదనిపించాడు. దీంతో అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వనున్నారు. ఇక రాహుల్ పరిస్థితే ఏమంత బాగాలేదు.
రాహుల్‌కు రోహిత్ ఎసరు
RELATED ARTICLES