అవన్నీ శుద్ధ అబద్ధాలు! : జార్కిహొళి
కర్నాటకలో ప్రతిపక్షాలకు దివ్యాస్త్రంగా మారిన వీడియో
బెంగళూరు : ఉద్యోగం ఇప్పిస్తానని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడి, యువతితో శృంగారకేళి సాగించిన కర్ణాటక జలవనరుల శాఖామంత్రి రమేశ్ జార్కిహొళి బుధవారంనాడు తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు తన రాజీనామా లేఖను పంపించారు. ఆయన రాసకేళి వీడియో, మీడియాలో హల్‌చల్ చేయడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న బిజెపి దేశవ్యాప్తంగా మరింత అప్రతిష్ఠపాలైంది. ఈ వీడియో, మంత్రి రాజీనామా వ్యవహారం ప్రతిపక్షాలకు దివ్యాస్త్రంగా మారింది. దినేశ్ కల్లహళ్ళి అనే సామాజిక కార్యకర్త బెంగళూరులో మంగళవారంనాడు మీడియాకు ఈ వీడియోను విడుదల చేశారు. ఈ రాసకేళి మంత్రి కర్ణాటకలో తొలుత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. గుర్తుతెలియని ఒక మహిళతో జార్కహొళి శృంగారంలో పాల్గొన్న వీడియోదృశ్యం దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. కర్ణాటకలోని పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి యువతిపై మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కల్లహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నానని ముఖ్యమంత్రికి సమర్పించిన లేఖలో జార్కిహొళి పేర్కొన్నారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనని, అవన్నీ శుద్ధ అబద్ధాలని, తనకేమీ తెలియదని మంత్రి వాదించారు. పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకే ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. రేపటినుండీ మొదలయ్యే కర్ణాటక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం దిక్కుతోచనిస్థితిలో పెద్ద ఇరకాటంలో పడింది. బిజెపి మానవ విలువలను గౌరవించే పార్టీ అయితే, ఆ పార్టీకి సిగ్గూ బిడియం ఉంటే రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. “ఇది జాతీయస్థాయి వార్త, ఇది బిజెపి ప్రభుత్వానికి సిగ్గుచేటు, జార్కహొళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి మంత్రి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ వీడియోను మీడియాకు విడుదల చేసిన సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్ళి మంగళవారంనాడే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాసకేళి వీడియోతో… మంత్రి రాజీనామా
RELATED ARTICLES