HomeNewsBreaking Newsరాష్ట్ర బడ్జెట్‌ 3 లక్షల కోట్లు?

రాష్ట్ర బడ్జెట్‌ 3 లక్షల కోట్లు?

ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు
నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రుణాలు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
2023 ఆర్థిక బడ్జెట్‌పై క్యాబినెట్‌ ఆమోదం
నేడు శాసనసభలో పద్దును ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2023 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చింది. రూ. 2,90 నుంచి రూ.3 లక్షల కోట్ల లోపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆదివారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు,కేటాయింపులు, ప్రధాన్యతలపై చర్చించారు. ‘ఎన్నికల బడ్జెట్‌’ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన హామీలకు నిధులను కేటాయించాలని నిర్ణయించారు. ముఖ్యంగా సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.3 లక్షలను అందించాలని ప్రస్తుత బడ్జెట్‌లో నిర్ణయించినప్పటికీ వచ్చే (2023- బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయి ంచినట్టు సమాచారం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,90 నుంచి రూ.3 లక్షల లోపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దళితబంధు నిమిత్తం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 17.700 కోట్లను కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఏడాది కూడా రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే వచ్చే బడ్జెట్‌లో కూడా రూ.17,700 వరకు ప్రతిపాదించినట్టు తెలిసింది.అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలిని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారు.బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కెసిఆర్‌ మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. కాగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మాన చర్చలో మంత్రి కెటి.రామారావు బాగా మాట్లాడారని మంత్రి వర్గం అభినంధించింది. ఇదిలా ఉండగా నాందేడ్‌ బిఆర్‌ఎస్‌ సభకు వెళ్లాల్సి ఉండగా మంత్రివర్గ సమావేశం త్వరగానే ముగిసింది.
నేడు బడ్జెట్‌
వచ్చే ఆర్థిక సంవత్సర-2023-24 బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు సోమవారం ఉదయం 10ః30 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments