HomeNewsBreaking Newsరాష్ట్ర బడ్జెట్‌ కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌ కోట్లు

ప్రజాపక్షం / హైదరాబాద్‌: సంక్షేమానికి, వ్యవసాయానికి గతం కంటే ఒకింత నిధులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,82,914 కోట్ల అంచనాలతో 2020 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుత బడ్జెట్‌ కంటే ఇది రూ.40వేలు కోట్లు ఎక్కువ. ఈ సారి కూడా ఎప్పటి లాగానే మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం రూ.4,482.12కోట్ల రెవెన్యూ మిగులును చూపింది. మరోవైపు రూ.33,191.25 కోట్ల ద్రవ్య లోటు ఉండబోతుందని అంచనా వేసింది. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు గా, మూలధన పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లుగా ప్రతిపాదించింది. ఈ మేరకు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, శాసనమండలిలో శానసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2020- సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టిఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలైన రూ.లక్ష రుణమాఫీ, 57 ఏళ్ళకే ఆసరా పెన్షన్‌, స్వంత స్థలంలో గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించా రు. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పిఆర్‌సికి హామీలను బడ్జెట్‌లో విస్మరించారు. కాగా కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, షాదీముబారక్‌, తదితర పాత పథకాలకు నిధులను పెంచారు. త్వరలో జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించి, రూ.10వేల కోట్లు కేటాయించారు. అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్‌, బిహెచ్‌ఇఎల్‌ నుంచి లక్డీకపుల్‌ వరకు మెట్రో రైలును విస్తరిస్తామని ప్రతిపాదించారు. పారిశ్రామిక రంగ ప్రోత్సాహకంగా రూ.1500 కోటాయించారు.
రెండు విధాలుగా రుణమాఫీ
రైతులకు 2014లో రూ.16124 కోట్లు రుణమాఫీ చేశామని, ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతు రుణ మాఫీ చెక్కులను ఇక నుంచి సంబంధిత ఎంఎల్‌ఎల ద్వారా రైతులకు నేరుగా అందజేయాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది ఉన్నారని, రూ.25 వేల లోపు రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ చేస్తామని, దీని కోసం ఈ నెలలో రూ.1198 కోట్లు విడుదల చేస్తామని ఆయన వివరించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేర కు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని, రైతు బంధు కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయింపునకు ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త పాస్‌ పుస్తకాల మంజూరు వల్ల రైతు బంధు లబ్దిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోందని, పెరిగిన లబ్దిదారులకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు అదనపు కేటాయింపులు చేశామని వెల్లడించారు. రైతు బీమా కోసం రూ.1141 కోట్లు కేటాయించామని చెప్పారు. వ్యవసా య అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని, పంటల ఉత్పత్తిలో 23.7శాతం, పాడిపశువుల రంగంలో 17.3శాతం సాధించామని మంత్రి వివరించా రు. వ్యవసాయం రంగంలో 18 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి రైతుకు భీమా సదుపాయం వర్తిస్తుందని, రైతు భీమా ప్రీమియం రూ.2271.50 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, విత్తనాల రాయితీ కోసం రూ.142 కోట్లు అం దించామని తెలిపారు. రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోందని, దీనికి రూ. 100 కోట్లను ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు.
పలు రంగాలకు నిధుల పెంపు
రైతుల పంటల మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకునేందుకు బడ్జెట్‌లో మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ ఫండ్‌ కోసం రూ. 1000 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రైతులు పరస్పరం చర్చిందుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల క్టస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని నిర్ణయించామని, దీనికి బడ్జెట్‌లో రూ. 350 కోట్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. ఆసరా పెన్షన్లదారుల సంఖ్య మరింత పెరగనుంది, గత బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 9402 కోట్లను కేటాయించగా, ఈసారి రూ. 11,758 కోట్లను ప్రతిపాదించినట్టు ప్రకటించారు. ఎస్‌సిల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16,534.97 కోట్లు, ఎస్‌టిల ప్రత్యేక నిధి కోసం రూ. 9,771.27 కోట్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. మరో వైపు మైనార్టీల సంక్షేమానికి రూ.1,518 కోట్లను ప్రతిపాదించి పలు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. పశుపోషణ, మత్స్య సంపద అభివృద్ధికి ఈ శాఖకు రూ. 1,586.38 కోట్లు ప్రతిపాదించామన్నారు. కళ్యాణ లక్ష్మీనిమిత్తం బిసిలకు అదనంగా రూ.600 కోట్లతో మొత్తం రూ. 1350 కోట్టు ప్రతిపాదించామని, వివిధ వర్గాల విద్యా సాంస్కృతిక సామాజిక వికాసానికి దోహదపడే ఆత్మగౌరవ భవన నిర్మాణాలను త్వరితగతిన పూ ర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రధాన్యతనిస్తూ బడ్జెట్‌ రూ. 4,356.82 కోట్లను ప్రతిపాదించారు. మహిళా స్వయం సహాయక సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1200 కోట్లను ప్రతిపాదించినట్టు చెప్పారు. పంచాయాతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 23,005 కోట్లను, మున్సిపల్‌ శాఖకు రూ.14,809 కోట్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వచ్చే ఐదేళ్లలో రూ. 50వేల కోట్లు అవసరమని ప్రభు త్వం అంచనా వేసిందని తెలిపారు. హైదరాబాద్‌ నగ రం, దాని పరిసరాల ప్రాంత అభివృద్ధితో పాటు మూసినది ప్రక్షాళన, మూసి రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అమలు కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 10వేల కోట్లు ప్రతిపాదించామన్నారు. ఫీజురియిబర్స్‌మెంట్‌ కోసం రూ. 2,650 కోట్లను, పాఠశాల విద్యాకు రూ. 10,421 కోట్ల ను, ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723 కోట్లను ప్రతిపాదించారు. ప్రజల ఆరోగ్య సంక్షణకు ప్రాధాన్యతనిస్తూ వైద్యరంగానికి రూ. 6,186 కోట్లను ప్రతిపాదించామన్నారు. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అవసరమైన మేరకు విద్యుత్‌ శాఖకు రూ. 10,416 కోట్లను, పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ. 1,998 కోట్లు, ఆర్‌టిసిని ఆదుకునేందుకు రూ. 1000కోట్లను, గృహనిర్మాణాని రూ. 11,917 కోట్లను, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ శాఖకు రూ. 791 కోట్లను, రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 500కోట్లను ప్రతిపాదించినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నదని, రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం రూ. 750 కోట్లను రవాణ, రోడ్డు భవనాల శాఖకు రూ. 3,494 కోట్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కెసిఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ చేశారని, బడ్జెట్‌లో సింహభాగం నిధు లు నీటిపారుదల రంగానికి కేటాయించామని తెలిపారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కెసిఆర్‌ జాతికి అంకితం చేయగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రఖ్యాతి గాంచిందన్నారు. కాళేశ్వరం స్పూర్తితో పాలమూరు రంగారెడ్డి, సీతారామా వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలు నేడు నిండుగా ప్రవహిస్తూ కళకళలాడుతున్నాయని మంత్రి చెప్పారు.
కేంద్రం అరకొర నిధులతో తగ్గిన వృద్ధి రేటు
దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నూతన అధ్యాయాన్ని సృష్టించిందని, అన్ని వర్గాల సంక్షేమం అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర పన్ను లు, పన్నేతర ఆదాయంపై పడిందని, ఫలితంగా 2019 కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గిందని మంత్రి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐజిఎస్‌టి, జిఎస్‌టి పరిహారం, నిధులు సకాలంలో రావడం లేదని ఆయన వెల్లడించారు. 2018- రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటు 16.1 శాతం కాగా కేంద్రం అరకొరగా నిధులు నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ది రేటు 6.3 శాతానికి తగ్గిందని మంత్రి వెల్లడించారు. దేశ తలసరి ఆదాయం రూ.1,35,050 కోట్లు ఉండగా 2019 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,28,216 కోట్లు ఉందన్నారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గిందని, ఫలితంగా 2020 21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2384 కోట్లు ప్రతికూ ల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందించి రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2019- బడ్జెట్‌లో అంచనాల మేరకు మార్చ్‌ నెలాఖరు వరకు 1,36000 కోట్లు ఖర్చు జరుగుతుంది. కాగా మంత్రి హరీశ్‌రావు ఉదయం 11.33 గంటలకు ప్రారంభించిన బడ్జెట్‌ ప్రసంగాన్ని సరిగ్గా 12.33 గంటలకు ముగించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments