రైతుబంధు పథకం ప్రతిష్ట ఎవరికి దక్కుతుందన్న అంశంపై బేరీజులు
హైదరాబాద్ : రైతుబంధు అమలు విషయంలో రాష్ట్ర ప్రభు త్వ ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్ళు చల్లింది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన పెట్టుబడి సాయం ఎకరాకు రూ.6 వేలను ప్రత్యక్షంగా తామే అమలు చేస్తామని, రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. త్వర లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వృద్ధా ప్య తదితర పెన్షన్లు, అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్రానికి నిధులను అంచనా వేసుకుని రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రాష్ట్రలు అమలు చేసే వృద్ధాప్య తదితర పెన్షన్లు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులలో కేంద్రం నిధుల వాటా కూడా ఉంటుంది. ముఖ్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ కింద ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయం కోసం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లను వెచ్చిస్తుతున్నది. ఇటీవల ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆర్థిక ఏడాది నుంచి ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఇందు కోసం రూ.15 వేల కోట్లు అవసరమౌతాయని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఇందు కోసం కేంద్ర బడ్జెట్‌లో రైతులకు రాయితీలు, సంక్షేమ పథకాల కింద ఇచ్చే నిధులను ఉపయోగించుకునే ఆలోచన చేసింది.కేంద్రం ప్రకటించిన ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్’ కింద ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున మొత్తం రూ.2800 కోట్లను అందించనుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి అవసరమైన నిధులకు కలిసి వస్తాయని, వేడినీళ్లకు చన్నీళ్లు మాదిరిగా ఉపయోగపడతాయని టిఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ నిధులను నేరుగా తామే రైతుల ఖాతాలలో జమ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం గొంతులో వెలక్కాయ పడ్డట్లుంది. ఈ నిధులను నేరుగా రైతులకు ఇవ్వొద్దని టిఆర్‌ఎస్ చెప్పే పరిస్థితి లేదు.నేరుగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వ డం వల్ల ఆ ఘనత బిజెపికి వెళుతుంది. మరోవైపు ఆ నిధులు నేరుగా రైతులకు వెళితే రైతు బంధుకు నిధులు సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ కింద రూ.200 చొప్పున ఇస్తోంది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటుంది.దానికి రాష్ట్ర ప్రభు త్వం మిగతా మొత్తం కలుపుకొని రూ.1000 ఇస్తున్నారు. తాజాగా దానిని రెట్టింపు చేసి రూ.2వేలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. వృద్ధాప్యపు పెన్షన్ తరహాలోనే రైతు బంధు తరహా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్రానికి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ శనివారం ప్రగతిభవన్‌లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చే నిధులపై ఈ సందర్భంగా చర్చించారు. పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాలోకి వేయాలని కేంద్రం భావించడం, రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్లుగా పెద్ద పద్దులైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథలకు నిధులు రాకపోవడం,వచ్చే ఏప్రిల్ నుండి రూ.3016 చొప్పున నిరుద్యోగ భృతి,పెన్షన్‌లరెట్టింపు వంటివి అమలు చేయాల్సి ఉండడంతో అదనంపు భారంపై చర్చ జరిగినట్లు తెలిసింది. నిధుల సమీకరణపై వివిధ అవకాశాలను పరిశీలించినట్లు సమాచారం. అలాగే ముందుగాఅనుకున్నట్లు ఓటాన్ అకౌం ట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేదా పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్ళాలా అనే అంశాల కూడా చర్చించినట్లు సమాచారం. చివరకు ఔటాన్ అకౌంట్‌కే వెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిసింది.కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం సవరణ బడ్జెట్ ఆధారంగా మన రాష్ట్రంలో కూడా తరువాత కేటాయింపులు చేసుకోవచ్చని సమావేశం భావించింది.
రాష్ట్ర ఆశలపై కేంద్రం నీళ్లు
RELATED ARTICLES