ప్రజాపక్షం / హైదరాబాద్ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కేరళ తరహా ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా వైర స్ విస్తరించకుండా నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, అ యితే వాటిని మరింత పకడ్బందీగా చేపట్టాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సిపిఐ పూర్తి సహకారం అందిస్తుందని, కరోనా నివారణకు పార్టీ యంత్రాంగం తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు. విస్తరిస్తున్న వైరస్ కారణం గా ఉపాధి కోల్పోతున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు, కూలీలకు, చిరువ్యాపారులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం మఖ్ధ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి చాడ వెంకట రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలకు పటిష్టమైన వైద్య సేవలు అం దించాలని, కరోనా వైరస్ విస్తరించకుండా మరి న్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయని అయితే కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల తో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయా న్ని గుర్తు చేశారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అజీజ్ పాషా మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పరీక్ష కేంద్రాలను పెంచాలని, కేసుల సంఖ్య పెరుగుతున్నందున వాటికి సరిపడే విధంగా పరీక్షలు కూడా పెరగాలన్నారు. తగిన వసతులతో ఐసోలేషన్ వార్డులను పటిష్టం చేసి ఒక్కో వార్డులో ఒకరిని మించి ఉంచకుండా చూడాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ
RELATED ARTICLES