రవిని సాగనంపేందుకు రాష్ట్ర ప్రభుత్వ సన్నాహం?
ద్రౌపది ముర్ముకు మెమొరాండం సమర్పణ
న్యూఢిల్లీ : తమిళనాడు శాసనసభ ప్రారంభసమావేశంలో ఈనెల 9న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి అనుచిత ప్రవర్తన గురించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసింది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ఇది రెండవసారి. గవర్నర్‌ను సాగనంపేందుకే ప్రభుత్వం ఈ సన్నాహాలు చేసిందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్రమంత్రి రేగుపతి సంకేతాలు కూడా ఇచ్చారు. ఆరోజు జరిగిన యావత్ సంఘటనను రాష్ట్రపతికి తమిళనాడు ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఒక మెమొరాండంను ప్రభుత్వం సమర్పించింది. అయితే ఆ మెమొరాండంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి? ఏ విధమైన ఫిర్యాదు ప్రభుత్వం చేసింది? తొలగించమని కోరిందా? వంటి విషయాలు స్వచ్ఛంధంగా తెలియరాలేదు. తమిళనాడు న్యాయశాఖామంత్రి ఎస్.రేగుపతి నాయకత్వాన ఒక ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతిని కలిసి ఈ మెమొరాండం సమర్పించింది. “ఈ మెమొరాండంలో ఏమి ఉండో ముఖ్యమంత్రికి తెలుసు, ఆయనే ఈ మెమొరాండం తయారు చేశారు అని పదే పదే అడిగిన ప్రశ్నకు ప్రతినిధి బృందం చెప్పింది తప్ప ఆ మెమొరాండంలో ఉన్న విషయాలు వెల్లడించలేదు. మా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన తెలియజేసిన సమాచారాన్ని రాష్ట్రపతికకి సమర్పించాం అని మంత్రి రేగుపతి చెప్పారు. పాత్రికేయులతో తమిళభాషలో చాలా పరిమితంగా ఆయన మాట్లాడి విషయం వివరించారు. గవర్నర్‌పై ప్రస్తుతం చెలరేగిన వివాదం నేపథ్యంలో “సంప్రదాయబద్ధంగా ఆయన రాజ్‌భవన్ నుండి బయలుదేరి వెళ్ళిపోయేందుకు ఉద్దేశించిన అంశాలు కూడా ఉండి ఉండవచ్చునని తామె ఊహిస్తున్నామని ఆయన సూచనాప్రాయంగా తెలియజేశారు. ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగపాఠంలో పలు కీలక అంశాలను గవర్నర్ రవి చదవకుండా వదిలేసి తనకు ఇష్టమైన పద్ధతులలోనే ప్రసంగం చదివారు. ఈవిధంగా రాజ్యాంగ సంప్రదాయాలను గవర్నర్ బాహాటంగా ఉల్లంఘించారు. పైగా ప్రసంగం మధ్యలోనే ఆపేసి సభ నుండి వాకౌట్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ సూచనతో ప్రభుత్వం తయారు చేసిన లిఖిత ప్రసంగపాఠాన్నే అసెంబ్లీ రికార్డుల్లో కొనసాగించేలా తీర్మానం చేసింది. “ఈ మెమొరాండంలో ఏం ఉందో మాకు తెలియదు, చివరిగా పేర్కొన్న పేరాల సారాంశం ఏమిటో తెలియదు అని ప్రతినిధి బృందం చెప్పింది. అయితే గడచిన నవంబరు నెలలో కూడా డిఎంకె నాకత్వానగల ప్రగతిశీల కూటమి రాష్ట్రపతి ముర్మును కలిసి గవర్నర్ రవిని తొలగించాలని కోరిన విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రమాణాన్ని ఆయన తప్పుతున్నారని ఆనాడు కూటమి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
రాష్ట్రపతి చెంతకు తమిళ గవర్నర్ తీరు
RELATED ARTICLES