88కి చేరిన కరోనా మరణాల సంఖ్య
కొత్తగా 94 పాజిటివ్ కేసులు నమోదు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఆరుగురు మరణించారు. తాజా కేసులన్నీ స్థానికంగా నమోదైన కేసులే. సోమవారంనాడు వలసకార్మికులు, ప్రవాసులకు సంబంధించి కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. జిహెచ్‌ఎంసితోపాటు వివిధ జిల్లాల్లో కొవిడ్ 19 లక్షణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నమోదైన 94 కరోనా కేసుల్లో 79 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనివే. మిగిలిన కేసుల్లో రంగారెడ్డి, మేడ్చల్‌లో 3 చొప్పున, మెదక్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, మహబూబాబాద్, పెద్దపల్లి, జనగాంలో ఒక్కో కేసు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ తప్పు ల తడకగా ఉన్నది. ఒక వైపు గడిచిన 14 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాల పేర్లు ప్రకటించిన వాటిలో పెద్దపల్లి, నల్లగొండ, మహబూబాబాద్ ఉన్నది. కానీ నల్లగొండ జిల్లాల్లో రెండు, పెద్దపల్లి, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదైనట్టుగా ఉన్నది. పైగా వలస కార్మికులు, విదేశాల నుండి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కూడా స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2792కు చేరుకోగా, ప్రస్తుతం 1491 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారంనాడు కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తంగా 88 మంది మరణించారు.
రాష్ట్రంలో మరో ఆరుగురు మృతి
RELATED ARTICLES