తెలంగాణలో 1085కి పెరిగిన కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారంనాడు కొత్తగా మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మూడు కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1085కి చేరింది. ఆదివారంనాడు 4౦ మంది డిశ్చార్జి కాగా, మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 585కి చేరింది. ఇప్పటివరకు 29 మంది మరణించారు. ఇంకా 471 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలుగా వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తిలు నిలిచాయి. అలాగే గడిచిన 15 రోజులుగా అంటే రెండు వారాలుగా 17 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆ జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, బద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట జిల్లాలు వున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 3 పాజిటివ్‌లు
RELATED ARTICLES