ముగ్గురు కరోనా బాధితులు మృతి
కేసులు పెరగకుండా చూడాలని సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం/ హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. గురువారం మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరింది. కాగా, గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తునప్పటికీ గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగారావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సూచించిన మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని, వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎంకు నివేదించినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. గురువా రం కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కే సులు సంఖ్య 1038 చేరుకుంది. మలకపెట్ గంజ్‌లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మా ర్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని మంత్రి చెప్పారు. వీరి కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో ఉంచామని, గంజ్, పహడీషరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల తెలిపారు. తాజాగా ముగ్గురు వ్యక్తులు కరోనా, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందారన్నారు. కాగా, 33 మంది కరోనాకు పూర్తి చికిత్స తరువాత, పరీక్షలో రెండు నెగెటివే రిపోర్ట్ రావడంతో డిశ్చార్జి చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాలపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న బృందం జ రుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్‌లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల హోం శాఖ జాయింట్ సెక్రెటరీ సలీల శ్రీవాత్సవ ప్రశంశలు కురిపించారని అన్నారు. కేంద్ర ప్రభు త్వ మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే రి పోర్ట్ పంపిన తరువాత రాజకీయ విమర్శలకు తా వు లేదని మంత్రి అన్నా రు. గాంధీ, కింగ్ కోఠి, గచ్చిబౌలి, ఫీవ ర్ హాస్పిటల్స్, లాబ్స్, కంటైన్మెంట్ ప్రాంతాలు, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, నైట్ షెల్టర్‌లు విస్ర్తుతంగా పర్యటించి అత్యంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ రిపోర్ట్ పంపించారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 22 కేసులు
RELATED ARTICLES