కొత్తగా రికార్డుస్థాయిలో 169 కేసులు
మరో నలుగురు మృతి
71కి చేరిన మృతుల సంఖ్య
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కొత్త జిల్లాలకు వ్యాపిస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్ర 5 గంటల వరకు 24 గంటల్లో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 100 మంది స్థానికులకు కరోనా సోకగా, అందు లో జిహెచ్‌ఎంసి పరిధిలో 82 మందికి, రంగారెడ్డి జిల్లాలో 14 మందికి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన 64 మందికి, వివిధ రాష్ట్రాల నుంచి ఐదుగురు వలస కార్మికులకు కూడా కరోనా బారిన పడ్డారు. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ శుక్రవారం మరో నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 2425 కరోనా కేసులలు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 2008 కాగా, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 417గా ఉంది. ఇప్పటి వరకు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకొని 1381 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం 973 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రానికి వచ్చిన 180 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన 207 మందికి, 30 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం విదేశాల నుంచి 458 మందిని భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తీసుకురాగా, వారిని హైదరాబాద్‌లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్వారంటైన్‌లో ఉంచారు. ఉంచారు. అందులో 207 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిషా, బిహార్ వంటి రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికుల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులను స్వగ్రామంలోనే హోం క్వారంటైన్‌లో ఉంచి, లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వరంగల్ రూరల్ జిల్లా, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జాబితాలో ఉన్నాయి. గత 14 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు జిల్లాలు వారం కిందట 26 ఉండగా, ఆ సంఖ్య శుక్రవారం నాటికి 17కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో కరోనా పంజా
RELATED ARTICLES