HomeNewsBreaking Newsరాష్ట్రంలో ఇక ఈ-పాలన

రాష్ట్రంలో ఇక ఈ-పాలన

వచ్చే వారం నుంచే ఈ-ఆఫీస్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం హెచ్‌ఒడిలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌
ప్రతిశాఖకు ఒక నోడల్‌ అధికారి, సాంకేతిక సహాయకుని నియామకం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్కార్‌ కీలక నిర్ణయం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో సహా ఇతర హెచ్‌ఒడిలు, ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది. ఉద్యోగుల మాస్టర్‌ డేటా బేస్‌ రూపొందించాలని, ఈ అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ల వివరాలు, డిజిటల్‌ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోట్‌ జారీ చేసింది. ప్రతిశాఖకు ఒక నోడల్‌ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించే విధంగా ఆదేశాలిచ్చింది. జులై రెండోవారం నుంచి ఈ ద్వారా పరిపాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో వచ్చేవారం నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ర్టంలో కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించడం కీలక పరిమాణం. ఫైళ్ల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమా దం ఉందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ద్వారా ఫైళ్ల నిర్వహణ సులభతరమై పారదర్శకత, విశ్వసనీయతలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎక్సయిజ్‌, కమర్షియల్‌ టాక్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఎండోమెంట్‌ శాఖల్లో ముందుగా ఈ ప్రక్రియను ప్రవేశ పెట్టనుంది. తరవాత ఇతర శాఖలకు దాన్ని విస్తరించనుంది. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సరంజామాను సమకూర్చుకోవడంతో పాటు ఉద్యోగుల మాస్టర్‌ డేటాబేస్‌, హైరార్కీ మ్యాపింగ్‌, వాళ్ళ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ వంటి వివరాలతోపాటు ఈ ముద్ర అప్లికేషన్‌ ద్వారా వాళ్ళ డిజిటల్‌ సంతకాలను ఈనెల 6వ తేదీలోగా ప్రతిశాఖకు ఒక నోడల్‌ అధికారిని నియమించి, 7వ తేదీ లోగా సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని వివిధ శాఖలకు సూచించింది. ఈనెల 8వ తేదీలోగా ఫైళ్ల డిజిటలైజేషన్‌, 9వ తేదీలోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసి, జులై రెండోవారం నుంచే ఈ ద్వారా ఆన్‌లైన్‌ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ సాఫ్ట్‌వేర్‌ను డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ రూపొందించింది. ఉద్యోగి తన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో ఈ ప్రవేశించి డిజిటల్‌ ఫైళ్ల సష్టి, నిర్వహణలతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. ప్రతీ అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్క్రిప్టెడ్‌ డిజిటల్‌ కీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దాంట్లోని డేటా, సమాచారం, ఇతర ఫైళ్లు టాంపర్‌కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఐటిశాఖ సహకారంతో ఎస్‌ఒ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు హైరార్కీ మ్యాపింగ్‌ చేస్తున్నారు. మామూలు పతిస్థితుల్లో లాగా కరెంట్ల నిర్వహణలో గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైళ్ల కదలిక నిరంతరం తెలిసేలా, నిర్దిష్ట సమయంలో అది ఏ అధికారి దగ్గర ఉంది, ఫైల్‌ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది తదితర వివరాలను ట్రాక్‌ చేసేలా, ఫైళ్ల నిర్వహణ పారదర్శకంగా జరిగేలా ఈ దోహదపడుతుంది. ఫైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్‌లో వచ్చే అలెర్ట్‌ల ద్వారా, లేదా ఈ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ త్వరలో అన్ని శాఖల్లో అమలుచేసి, అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అయితే డిజిటల్‌ ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగలంటే ప్రతి సెక్షన్‌కు కనీసం ఒక స్కానర్‌ అవసరమవుతుంది. ఒకచోట స్కాన్‌ చేసి ఫైల్‌ను అప్‌లోడ్‌ చేస్తే ఇక అది డిజిటల్‌ ఫైల్‌ రూపంలో ప్రతి సిస్టంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఐతే ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం ప్రతి అధికారి దగ్గర 4 జీబీ ర్యామ్‌ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న డెస్క్‌ టాప్‌ సిస్టం అవసరమవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments