అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం మరోవైపు రుతుపవనాలు ఉన్నందున తెలంగాణ, రాయలసీమల్లో అతి భారీ వర్షాలు పడతాయని, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలోని అల్పపీడనం అంచనాలకు విరుద్ధంగా ఉన్నచోటనే కొనసాగుతోంది. అయితే ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ బలం పుంజుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నైరుతి రుతుపవనాలు తమిళనాడు అంతటా వ్యాపించాయి. రాయలసీమలో కూడా మరికొంత ముందుకు కదిలాయి. గురువారం ఇవి కోస్తాంధ్ర, తెలంగాణలలో ప్రవేశించాయి. బుధవారం తునిలో 3 సెంటీమీటర్లు, విశాఖలో ఒక సెంటీ మీటరు వర్షం పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం ఈదురుగాలులతో అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు
RELATED ARTICLES