ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కెఆర్‌ఎంబి ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్‌బోర్డు (కెఆర్‌ఎంబి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తప్పుబట్టింది. ఈ మేరకు కెఆర్‌ఎంబి సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశం పంపారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందు కు వెళ్లడానికి వీల్లేదని లేఖలో ఎపి ప్రభుత్వానికి బోర్డు తెలిపింది. కాగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్ధమైందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా వాటర్ బోర్డు ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని బోర్డు తప్పుబట్టింది. కొత్త ప్రాజెక్టులేవైనా ముందుగా వాటి సమగ్ర నివేదిక (డిపిఆర్)ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని బోర్డు నిర్దిష్టంగా పేర్కొన్నదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
కృష్ణా నదీ జల వివాదాల ట్రిబున్యల్ చైర్మన్‌గా తాళపత్ర
కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యూనల్ చైర్మన్‌గా జస్టిస్ ఎస్.తాళపత్ర నియమితులయ్యారు. గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ బి.పి.దాస్ రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ పదవికి ఏర్పడిన అంతర్రాష్ట నదీ జలాల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 5 ఎను అనుసరించి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ భర్తీ చేసింది. జస్టిస్ తాళపత్ర ప్రస్తుతం త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌నుతక్షణమే ఆపేయండి!
RELATED ARTICLES