న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంకు సంబంధించిన దస్తావేజులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వం బుధవారం సుప్రీంకో ర్టుకు తెలిపింది. చోరికి గురైన దస్తావేజుల ఆధా రంగా ఆర్టికల్స్‌ను ప్రచురించిన ‘ది హిందు’ దిన పత్రికపై దర్యాప్తు చేపడతామని ప్రభుత్వం సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపింది. అధికారిక రహ స్యాల చట్టాన్ని ఉల్లంఘించి ఆర్టికల్‌ను ప్రచురిం చినందుకు గరిష్ఠంగా 14 ఏళ్ల శిక్ష, చట్టం ధిక్క రించినందుకు 6నెలల జైలుశిక్ష, ఇంకా రూ. 2000 జరిమానా పడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ యుద్ధ విమా నాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన సమీక్షా అర్జీపై న్యాయస్థానం బుధవారం విచారణ చేప ట్టింది. రాఫెల్ ఒప్పందం ప్రక్రియను సందేహిం చడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ గత ఏడాది డిసెం బరు 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాలు చేస్తూ వచ్చిన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పలు వురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యా యవాది ప్రశాంత్ భూషణ్ సంయుక్తంగా పిటిష న్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. రాఫెల్ ఒప్పందంపై అనేక పిల్స్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు)ను కొట్టేయాలని సుప్రీంకోర్టు నిర్ణ యించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక కీలక విషయాలను తొక్కిపెట్టిందని వారు తమ పిటిష న్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్.. రాఫెల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యా యని, దానిపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడిం చారు. ‘దిహిందు’ దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ ఆర్టికల్ రాశారని భూషణ్ ప్రస్తావించినప్పుడు వేణుగోపాల్ దొంగిలించిన దస్తావేజుల ఆధారంగానే ఆ రైటప్స్ ప్రచురించారన్నారు. రాఫెల్ ఒప్పందం దస్తావేజులు దొంగిలింపబడడంపై ఇంకా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. రామ్ రాసిన తొలి రైటప్ ఫిబ్రవరి 8న ప్రచురితమైందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోర్టు విచారణను ప్రభావితం చేసేలా ఆయన మరో ఆర్టికల్ కూడా రాశారని, ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్నారు. కోర్టు ముందు కెకె వేణుగోపాల్ వాదిస్తూ ‘రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయి. అధికారిక రహస్యాల చట్టం ప్రకా రం ఇలాంటి పత్రాలు ప్రజల అందుబాటులో ఉంచేవారు(ఇన్ పబ్లిక్ డొమైన్) దోషులవుతారు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పందిసూ పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మధ్యా హ్నం 2 గంటలకు కోర్టుకు వెల్లడించాలని ఆదేశించారు. దానికి అటార్నీ జనరల్ దస్తావేజులను ‘రహస్యం, వర్గీకృతం’ అని మార్క్ చేశామని, కనుక అది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన అవుతుందన్నారు. పైగా దస్తావేజుల దొంగిలింపుపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దీనికి ముందు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. 2018 డిసెంబరు 14న 2018 రాఫెల్‌పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాఫెల్ కేసు రక్షణ రంగం సేకరణకు సంబంధించిందని, దానిని న్యాయపరంగా సమీక్షించకూడదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గత వారం పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరును ప్రస్తావించారు. మనపై బాంబులు వేసిన పాకిస్థాన్ ఎఫ్-16 విమానాలను ఎదుర్కోడానికి మనకు రాఫెల్ యుద్ధ విమానాల అవసరం ఉందన్నారు. ఫ్లుఅవే కండిషన్‌లో రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన రెండు స్కా డ్రన్లు మనకు వస్తున్నాయన్నారు. మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా వస్తుందని వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. 1960 దశకానికి చెందిన పాత తరం మిగ్ 21, పాకిస్థాన్ ఉపయోగించిన ఎఫ్-16 కన్నా బేషుగ్గా పనిచేశాయని, మనకు రాఫెల్ జెట్ యుద్ధ విమానాల అవసరం ఉందని కూడా వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రివ్యూ పిటిషన్ల తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 14కు వాయిదా వేసింది.
రాఫెల్ రహస్య పత్రాల చోరీ
RELATED ARTICLES