భారత్ యువ జట్టు శుభారంభం, సౌతాఫ్రికా అండర్ రెండో టెస్టు
తిరువనంతపురం: భారత్, సౌతాఫ్రికా అండర్ జట్ల మధ్య జరుగుతున్న యూత్ రెండో టెస్టులో భారత్ శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా యువ జట్టు 54.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మణిషి 5 వికెట్లతో విజృంభించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. భారత్‌కు ఆధిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ దివ్యాంష్ (2) పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత యువ జట్టు 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతంర వాత్సల్ (25; 93 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ జైస్వాల్ భారత్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు అవకాశం లభించినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు సాధించారు. ఒకవైపు వాత్సల్ కుదురుగా ఆడుతుంటే.. మరోవైపు జైస్వాల్ మాత్రం ధాటిగా ఆడుతూ 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే భారత్ 31.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. అనంతరం సమన్వయంతో ఆడుతున్న వాత్సవ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం తొలి రోజు సమయం ముగియడంతో భారత్ అండర్ జట్టు 34.5 ఓవర్లలో 112/2 పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన ఓపెనర్ యశశ్వి భుపేంద్ర జైస్వాల్ (81 బ్యాటింగ్; 109 బంతుల్లో 11 ఫోర్లు) అజేయంగా క్రీజులో ఉన్నాడు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా యువ జట్టుకు భారత బౌలర్ మణిషి చుక్కలు చూపెట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో సఫారీ యువ జట్టును ఆటాడుకున్నాడు. వరుసక్రమంలో వికెట్లు తీస్తూ పోవడంతో సౌతాఫ్రికా జట్టు 54.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. సఫారీ జట్టులో బ్రీస్ పార్సొన్స్ (64; 76 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్ రౌన్ టెర్బలాంచే (51)లు అర్ధ శతకాలతో రాణించారు. మరోవైపు కుమలో (13) మినహా మిగతా ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ రెండంకెల మార్కును కూడా దాటలేక పోయారు. దీంతో సఫారీ యువ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరకే ఆలౌటైపోయింది. భారత బౌటర్లలో మణిషి 5 వికెట్లతో విజృంభించగా.. హృతిక్ షోకీన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
రాణించిన జైస్వాల్, మణిషి
RELATED ARTICLES