తొలి రోజు హైదరాబాద్ 240/7, పంజాబ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్
హైదరాబాద్: పంజాబ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (60), కెప్టెన్ అక్షత్ రెడ్డి (77) పరుగులతో రాణించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఈలైట్ గ్రూప్-బిలో భాగంగా శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ అక్షత్ రెడ్డి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, అక్షత్ రెడ్డి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందు కు సాగించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 20.5 ఓవర్లలో హైదరాబాద్ స్కోరును 50 పరుగులకు చేర్చారు. ఒకవైపు తన్మయ్ కుదురుగా ఆడుతూంటే మరోవైపు అక్షత్ రెడ్డి మత్రం దూకుడగా ఆడాడు. ఈక్రమంలోనే అక్షత్ 86 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జంటను విడదీయడానికి పం జాబ్ బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి నిరాశే మిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ 35.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. తర్వాత 125 పరుగుల వద్ద హైదరాబాద్‌కు తొలి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న అక్షత్ రెడ్డి (77; 127 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్)ను సన్వీర్ సింగ్ ఔట్ చేశాడు. త ర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ రాయడు (2) పరుగులకే వెనుదిరిగాడు. అనంత రం హిమాలయ్ అగర్వాల్‌తో కలిసి తన్మయ్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సమన్వయంతో ఆడుతున్న తన్మయ్ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ కొద్ది సేపటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న తన్మయ్ అగర్వాల్ (60; 158 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)ను సిద్ధార్థ్ కౌల్ పెవిలియన్ పం పాడు. అనంతరం బి. సందీప్ వేగంగా ఆడే క్రమంలో (62 బంతుల్లో 30) పరుగులు చేసి మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత పుంజుకున్న పంజాబ్ బౌలర్లు వెనువెంటనే వికెట్లు తీస్తూ హైదరాబాద్‌ను కట్టడి చేశారు. చైతన్య (0), రవితేజ (1)లను మార్కంచే ఔట్ చేయడంతో హైదరాబాద్ తొలి రోజు ఆట ము గిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. మరోవైపు అర్ధ శతకం సాధించి అజేయంగా క్రీజులో ఉన్న హిమాల్ అగర్వాల్ 51 పరుగులు చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ ఇతనిపైనే ఆశలు పెట్టుకుంది. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే మూడు వికెట్లు పడగొట్టగా.. సిద్ధర్థ్ కౌల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
రాణించిన అక్షత్ రెడ్డి, తన్మయ్
RELATED ARTICLES